
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో రచ్చ మొదలైంది. మొదటి రోజే కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరిని ఒకరు తిట్టేసుకున్నారు. ఇక నామినేషన్స్ సందర్భంగా ఈ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఎప్పుడూ సరదాగా కనిపించే జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ ఉన్నట్లుండి సీరియస్ అయ్యాడు. తోటి కంటెస్టెంట్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో రామ్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఇకపై తనను నామినేట్ చేసే ముందు చాలా సార్లు ఆలోచించుకోవాలని రామ్ ప్రసాద్ ఎవరికో గట్టిగా వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ‘రేపటి నుంచి నేను ఎవరినైనా నామినేట్ చేయాలంటే మీరు ఊహించలేరు. ఇది ఒక రీజనా అని అడిగితే.. అఫ్‌కోర్స్ అని చెబుతా. మీరు చాలా తెలివైన వాళ్లని అనుకుంటున్నా. కాబట్టి గేమ్ జాగ్రత్తగా ఆడండి. నాతో మాత్రం పెట్టుకోవద్దు. నామినేషన్ చేసే ముందు చాలా సార్లు ఆలోచించండి’ అని తోటి కంటెస్టెంట్స్ కుస్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడీ జబర్దస్త్ స్టార్ కమెడియన్
అంతేకాదు.. రెడ్ గ్రూప్‌లో ఉన్న ఎనిమిది మంది సభ్యులు పక్కకు వెళ్లి మాట్లాడుకోవాలని సూచించాడు రామ్ ప్రసాద్. తమలో కనీసం ముగ్గురైనా తన మాట కరెక్ట్ కాదని చెబుతారని ఈ విషయంలో జాగ్రత్తగా నడుచుకోవాలన్నాడీ స్టార్ కమెడియన్. ప్రస్తుతం ఈ హాట్ డిస్కషన్ కు సంబంధించిన వీడియో వైరల్ గామారింది. అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగింది? రామ్ ప్రసాద్ ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నాడు? ఎవరిని నామినేట్ చేయబోతున్నాడు? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అంతేకాదు తనను నామినేట్ చేస్తే తాను కూడా ఊహించని విధంగా రియాక్ట్ అవుతానంటూ రామ్ ప్రసాద్ చెప్పడంతో నామినేషన్స్ ఏ రేంజ్ లో జరుగుతున్నాయో అర్థం అవుతోంది. దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాల్సిందే.
A sweet warning from Auto. Top5 contestant?#BiggBossTelugu10 pic.twitter.com/tML4F3H640
— AnantapurBO (@AnantapurBO) September 8, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.