Bigg Boss Telugu 10: త్రిగుణ్ ఆ బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దగ్గరి బంధువా? అతని లాగే కప్పు గెలుస్తాడా?

ఇటీవలే ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో కంటెంట్ కింగ్ ఎవరని అడిగితే చాలా మంది హీరో త్రిగుణ్ పేరే చెబుతున్నారు. అఫ్ కోర్స్ కొన్ని విషయాల్లో అతను నెగెటివ్ గా అనిపిస్తున్నా మొత్తానికి త్రిగుణే ఆడియెన్స్ కు మంచి ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్నాడని ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు.

Bigg Boss Telugu 10: త్రిగుణ్ ఆ బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దగ్గరి బంధువా? అతని లాగే కప్పు గెలుస్తాడా?
Bigg Boss Telugu 10 Thrigun

Updated on: Sep 10, 2026 | 7:00 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 06న ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు. అందులో 10 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కాగా మరో ఆరుగురు కామనర్స్ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లో దేబ్ జానీ, జబర్దస్త్ రామ్ ప్రసాద్, పొట్టి నరేష్, కృష్ణుడు, టెంపర్ వంశీ, త్రిగుణ్, యాంకర్ వర్షిణీ, ముఖేష్ గౌడ, సుధీర్ రెడ్డి, ఛైత్ర రాయ్ ఉన్నారు. బిగ్ బాస్ షో ప్రారంభమై మూడు రోజులు గడిచిపోయాయి. ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ ఆడియెన్స్ మనసులు గెల్చుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిజికల్ టాస్కుల్లో సత్తా చాటుతూనే ప్రేక్షకులకు తమదైన ఎంటర్ టైన్మెంట్ ను అందించేందుకు కృషి చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ 10 లో ఇప్పటి వరకు తన రేంజ్ కంటెంట్ ఇచ్చింది హీరో త్రిగుణే అని చెప్పుకోవచ్చు. షో ప్రారంభం నుంచే అతను అగ్రెసివ్ గా గేమ్ ఆడుతున్నాడు. అఫ్ కోర్స్ తనలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి. కేవలం రోహిత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నాడన్న నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ మెజారిటీ ఆడియెన్స్ మాత్రం త్రిగుణ్ కే సపోర్టు చేస్తున్నారు. అయితే ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ కు సంబంధించిన ఒక విషయం ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది.

హీరో త్రిగుణ్ అసలు పేరు ఆదిత్ అరుణ్.  తెలుగు, తమిళం భాషల్లో హీరోగా పలు సినిమాలు చేశాడు. కొన్ని సినిమాల్లో సెకెండ్ హీరోగానూ ఆకట్టుకున్నాడు.   2009 లో కథ అనే తెలుగు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు త్రిగుణ్. ఆ తర్వాత తుంగభద్ర, గరుడవేగా, 24 కిసెస్, చీకటి గదిలో చితక్కొట్టుడు, డియర్ మేఘ, లైన్ మ్యాన్, ఈషా ఇలా తెలుగు, తమిళ భాషల్లో సుమారు 30 సినిమాలు చేశాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అలాగే పలు వెబ్ సిరీసుల్లోనూ నటించాడు. రీసెంట్ సూపర్ హిట్ సినిమా చెన్నై లవ్ స్టోరీలోనూ సెకెండ్ హీరోగా చేశాడు త్రిగుణ్. ఇదే క్రమంలో తన క్రేజ్ తో బిగ్ బాస్ షోలోనూ అదృష్టం పరీక్షించుకునేందుకు కూడా రెడీ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌస్ లో త్రిగుణ్..

అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 టైటిల్ విన్నర్, సింగర్ రేవంత్ త్రిగుణ్ కు బంధవు అవుతాడట. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం కూడా ఉందట. ఇప్పుడీ విషయం నెట్టింట వైరల్ గా మారింది. కాగా ఆట, మాట తీరులోనూ త్రిగుణ్ రేవంత్ ను గుర్తు చేస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య బంధుత్వం ఉందని తెలియడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి రేవంత్ లాగే త్రిగుణ్ బిగ్ బాస్ కప్పు కొడతాడా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us