
బిగ్ బాస్ తెలుగు పదో సీజన్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ రియాలిటీ షో ప్రారంభంకావచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అగ్ని పరీక్ష సీజన్ 2 దాదాపు ఎండింగ్ కు చేరుకుందని సమాచారం. మరోవైపు ఈసారి హౌస్ లోకి వచ్చే సెలబ్రిటీ కంటెస్టెంట్లను ఒక్కొక్కరినీ ఫైనల్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్ లో కంటెండర్స్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో అయితే చాలా మంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, కావ్యశ్రీ, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్ జబర్దస్త్ ఫేమ్ ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, నందూస్ వరల్డ్ నందూ, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ ఇలా చాలా మంది పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడీ జాబితాలోకి మరో సీరియల్ నటుడి పేరు చేరింది. అతను మరెవరో కాదు
ముఖేష్ గౌడ. ఇలా పేరు చెబితే చాలా మంది గుర్తు పట్టలేరు.. కానీ గుప్పడెంత మనసు సీరియల్ లో రిషి అంటే ఇట్టే గుర్తు పడతారు.
పేరుకు సీరియల్ హీరోనే అయినా ముఖేష్ గౌడకు ఓ సినిమా హీరోకు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా అమ్మయాలు ఈ నటుడు అంటే పడి చస్తారు. . ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో ముఖేష్ లుక్స్, యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ నటుడికి మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు మూడు లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ కారణంగానే ముఖేష్ కు సినిమాల్లోనూ ఛాన్సులు వస్తున్నాయి.
కాగా ఈ సీరియల్ హీరోకు గతంలోనే బిగ్ బాస్ ఆఫర్లు వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా అతనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తెలుగు బిగ్ బాస్ నుంచే కాకుండా కన్నడ బిగ్ బాస్ నుంచి కూడా తనకు పిలుపు వచ్చిందని, భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారని, అయితే బిగ్ బాస్ గేమ్ అర్థం కాక రిజెక్ట్ చేశానని ముఖేష్ తెలిపాడు. అయితే పదో సీజన్ లో మాత్రం ముఖేష్ ఎంట్రీ కచ్చితంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. గతంలో కంటే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని, ఈసారి బిగ్‌బాస్ తెలుగు 10లోకి ముఖేష్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ లాంచింగ్ దాకా ఎదురు చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి