
బిగ్ బాస్ గేమ్ షో పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో దివి ఒకరు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న దివి. ఆ తర్వాత ఈ అందాల భామ పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. అలాగే మరో రెండు మూడు సినిమాల్లోనూ నటించింది. ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ గేమ్ షోలోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ లో తన గేమ్ తో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బ్యూటీకి అంతగా ఆఫర్స్ రాలేదు. బిగ్ బాస్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి దివికి సినిమాలో ఛాన్స్ ఇస్తా అని మాట ఇచ్చారు.
ఆతర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటించింది ఈ చిన్నది. ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. ప్రైవేట్ ఆల్బమ్స్ తో ఆకట్టుకుంటుంది. అలాగే మొన్నామధ్య హీరోయిన్ గానూ ఓ సినిమా చేసింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను కవ్విస్తుంది దివి. కాగా దివి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతంలో ఒక ఇంటర్వ్యూలో దివి మాట్లాడుతూ.. మిర్చిసినిమా చూసినప్పటి నుంచి ప్రభాస్‌కు తాను వీరాభిమానిగా మారానని, ఆ తర్వాత బాహుబలి చిత్రాలతో ఆయన పట్ల తన అభిమానం మరింత పెరిగిందని దివి చెప్పుకొచ్చింది. ప్రభాస్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పంపినట్లు గుర్తు చేసుకుంది దివి. చాలా మంది అభిమానుల్లాగే ఒక్కసారి ప్రభాస్‌ను చూడాలని, కలవాలనిఉందని, ఆయనతో ఓ డిసెంట్ కాఫీ డేట్‌కు వెళ్లాలని దివి చెప్పుకొచ్చింది. ప్రభాస్ ఇంటికి వచ్చిన అతిథులను చాలా ఆప్యాయంగా చూసుకుంటారని, ఆయన ఆతిథ్యం అద్భుతంగా ఉంటుందని తాను విన్నానని తెలిపింది. తన డ్రీమ్ డేట్ ఒక కూల్ కాఫీతో మొదలవ్వాలని, ప్రభాస్‌తో కూర్చుని మనసువిప్పి మాట్లాడాలని ఉందని మనసులో మాట బయట పెట్టింది. ఈ కోరిక నెరవేరాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చింది దివి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.