టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన స్వీటీ.. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ప్రభాస్, గోపిచంద్, రవితేజ, వెంకటేష్ జోడిగా కనిపించి అలరించింది. కేవలం హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదని అరుంధతి సినిమాతో రుజువు చేసింది. లేడి ఓరియెంటెడ్ సినిమాగా వచ్చిన అరుంధతి చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. ఇక ఆ తర్వాత భాగమతి సినిమాతో మరోసారి మెప్పించింది. తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటించిన అనుష్క.. బాహుబలి తర్వాత మాత్రం సైలెంట్ అయ్యింది. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ జోడిగా దేవసేన పాత్రలో కనిపించింది. ఇందులో మరోసారి తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రుద్రమదేవిగా, భాగమతి.. దేవసేనగా తెలుగు సినీ ప్రియుల హృదయాలను దొచుకున్న అనుష్క.. వేద సినిమాలో సరోజ పాత్రలో అదరగొట్టేసింది. ఈరోజు (నవంబర్ 7న) స్వీటీ పుట్టినరోజు. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అనుష్క.. ఎంత సంపాదించిందో తెలుసా ?..
అనుష్క శెట్టి.. 1981 నవంబర్ 7న మంగళూరులో జన్మించింది. ఆమె అసలు పేరు స్వీటీ శెట్టి. బెంగుళూరులోని మౌత్ కార్మెల్ కాలేజీలో కంప్యూటర్ అప్లికేషన్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. సినీ పరిశ్రమలోకి రాకముందు ఆమె యోగా శిక్షకురాలిగా పనిచేసింది. 2005లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ సినిమాతో తెరంగేట్రం చేసింది. దాదాపు 20 సంవత్సరాలుగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు చేసింది.
నివేదికల ప్రకారం.. ఇప్పటివరకు దాదాపు రూ.133 కోట్లు సంపాదించింది. ఒక్కో సినిమాకు రూ.6 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అలాగే బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా ఏడాదికి రూ.12 కోట్లు అందుకుంటుంది. అనుష్కకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో దాదాపు రూ.12 కోట్లు విలువైన భవనం ఉన్నట్లు సమాచారం. అలాగే అనుష్క వద్ద టయోటా కరోలా ఆల్టిస్, ఆడి క్యూ5, ఆడి ఎ6, జీప్ కంపాస్, బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ ( రూ.69-79 లక్షలు) కార్లు ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.