Allu Arjun: ఫాదర్స్‌డే స్పెషల్.. చాగంటి ప్రవచనాలతో అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. వీడియో ఇదిగో

ఇంటర్నేషన్ ఫాదర్స్ డే ను పురస్కరించుకుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. తన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పై తనకున్న ప్రేమకు అక్షర రూపమిస్తూ పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.

Allu Arjun: ఫాదర్స్‌డే స్పెషల్.. చాగంటి ప్రవచనాలతో అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. వీడియో ఇదిగో
Allu Arjun, Allu Aravind

Updated on: Jun 21, 2026 | 4:50 PM

ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే సందర్భంగా అందరూ తమ తండ్రులకు విషెస్ చెబుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తమకు తోచిన రీతిలో తండ్రి గొప్ప తనాన్ని చెబుతూ పోస్టులు షేర్ చేసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి నాన్నతో తమకున్న అనుబంధాన్ని, మధుర క్షణాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. టాలీవుడ్ హీరో, హీరోయిన్లు కూడా తమ తండ్రులతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం తన తండ్రికి వినూత్నంగా ఫాదర్స్ డే విషెస్ చెప్పారు. అల్లు అరవింద్ తో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన బన్నీ.. ‘నా తండ్రే నా దైవం. కంటికి కనిపించే, మాట్లాడే ఏకైక దేవుడు ఆయనే. నా జీవితంలో సర్వస్వం ఆయనే ఇచ్చారు’ అని తండ్రిపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చారు. అయితే ఈ పోస్ట్ కు తండ్రి గురించి ఓ సందర్భంలో చాగంటి చెప్పిన ప్రవచనాన్ని వాయిస్ ఓవర్ గా జోడించాడు. ఆ తర్వాత ప్రపంచంలోని తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

 

ఇవి కూడా చదవండి

సినిమా షూటింగ్ లతో బిజీ బిజీగా ఐకాన్ స్టార్..

ఇక సినిమాల విషయానికి వస్తే.. పుష్ప 2 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం రాకా. కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సంస్థ సుమారు 800 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పాన్ వరల్డ్ లెవెల్ లో రాకా సినిమాను నిర్మిస్తోంది. . భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. దీంతో పాటు లోకేశ్ కనగరాజ్
దర్శకత్వంలోనూ ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు బన్నీ. త్వరలోనే ఈ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

అల్లు అర్జున్ షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్..

‘అల్లు సినిమాస్’ లో ఐకాన్ స్టార్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us