Allu Arjun: అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఓపెనింగ్.. బన్నీ స్టైల్ చూశారా ?.. అచ్చం ఆ సినిమాలాగే ఉందిగా..

|

Mar 29, 2024 | 8:15 AM

ఇప్పటికే లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మన తెలుగు హీరోలు ప్రభాస్, మహేష్ బాబు మైనపు విగ్రహాలు ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ ది మాత్రం దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అలాగే మార్చి 28న బన్నీ హీరోగా పరిచయమైన ఫస్ట్ మూవీ గంగోత్రి విడుదలైన రోజు. అదే రోజున తన మైనపు విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడం సంతోషంగా ఉందని తెలిపాడు బన్నీ. తన జీవితంలో ఇది మరుపురాని ప్రయాణమని.. ఈరోజు ఎప్పటికీ ప్రత్యేకమంటూ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Allu Arjun: అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఓపెనింగ్.. బన్నీ స్టైల్ చూశారా ?.. అచ్చం ఆ సినిమాలాగే ఉందిగా..
Allu Arjun Photos
Follow us on

వరల్డ్ వైడ్ క్రేజ్ అందుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు మరో అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న మొట్ట మొదటి టాలీవుడ్ హీరోగా రికార్డ్ సృష్టించగా.. ఇప్పుడు మేడమ్ టూస్సాడ్స్ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది అక్టోబర్ నెలలో మ్యూజియం నిర్వాహకులు అల్లు అర్జున్ దగ్గరకి వచ్చి కొలతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బన్నీ విగ్రహాం పూర్తి కాగా.. నిన్న రాత్రి మార్చి 28న అల్లు అర్జున్ స్వయంగా తన మైనపు విగ్రహాన్ని ఓపెనింగ్ చేశారు. ఈ విగ్రహం అల వైకుంఠపురంలో సినిమాలోని రెడ్ జాకెట్ కాస్ట్యూమ్ తో పుష్ప మేనరిజం చూపిస్తూ తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ఓపెనింగ్ తర్వాత తన మైనపు విగ్రహంతో సెల్ఫీ తీసుకుని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలకు తగ్గేదే లే అంటూ కామెంట్ చేశాడు. అలాగే మైనపు విగ్రహం ఓపెనింగ్ వీడియోనూ కూడా పంచుకున్నాడు. బన్నీతో పాటు ఆయన ఫ్యామిలీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. ప్రస్తుతం అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఫోటోస్ వైరలవుతుండగా.. బన్నీకి కంగ్రాట్స్ తెలుపుతున్నారు సినీ సెలబ్రెటీస్, అభిమానులు.

ఇప్పటికే లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మన తెలుగు హీరోలు ప్రభాస్, మహేష్ బాబు మైనపు విగ్రహాలు ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ ది మాత్రం దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అలాగే మార్చి 28న బన్నీ హీరోగా పరిచయమైన ఫస్ట్ మూవీ గంగోత్రి విడుదలైన రోజు. అదే రోజున తన మైనపు విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడం సంతోషంగా ఉందని తెలిపాడు బన్నీ. తన జీవితంలో ఇది మరుపురాని ప్రయాణమని.. ఈరోజు ఎప్పటికీ ప్రత్యేకమంటూ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన వెన్నంటే ఉన్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపాడు.

ఇదిలా ఉంటే.. గతంలో పుష్ప సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన బన్నీ.. ఇప్పుడు పుష్ప 2తో మరోసారి రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నారు. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ పార్టులో స్మగ్లర్ పుష్పరాజ్ గా అలరించిన బన్నీ..ఇప్పుడు సెకండ్ పార్టులో ఎలాంటి మ్యాజిక్ చేయనున్నాడనేది చూసేందుకు అడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాజిల్, రష్మిక మందన్న కీలకపాత్రలు పోషిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.