బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన భర్త అభిషేక్ బచ్చన్‌తో విడాకులు తీసుకోనుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై బచ్చన్ కుటుంబం బహిరంగంగా ఏమీ చెప్పలేదు. గతకొంత కాలంగా ఐష్ విడిగా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లిన ఐష్ తన కూతురితో వెళ్తుంది. అయితే ఐష్ అభిషేక్ కు సంబంధించిన పాత వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్లు చర్చను ప్రారంభించారు. ఈ వీడియోలో, ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ మధ్య మాటల తూటాల సన్నివేశం ఉంది.
ప్రొ కబడ్డీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన కుటుంబంతో కలిసి ఆడియన్స్ గ్యాలరీలో కూర్చున్నారు. ఆమె వెంట ఆమె భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్య బచ్చన్, అలాగే నవ్య నవేలి నందా ఉన్నారు. ఆ సమయంలో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ మధ్య ఏదో గొడవ జరిగింది. ఇద్దరూ వాదించుకుంటూ కనిపించారు. విడాకుల వార్త వైరల్ అవ్వడంతో.. ఈ వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అభిషేక్ బచ్చన్‌తో వాదన తర్వాత ఐశ్వర్యరాయ్ సైలెంట్ అయ్యింది. తర్వాత నవ్య నవేలి నంద కూడా ఏదో చెప్పాలని ప్రయత్నించి సైలెంట్ అయిపోయింది. ఐశ్వర్య ప్రవర్తన చూసి నవ్య కూడా సైలెంట్ అయ్యింది. వారి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందనేది వీడియోలో స్పష్టంగా లేదు. అయినా కూడా నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఐశ్వర్యరాయ్ మరియు అభిషేక్ బచ్చన్ 2007లో వివాహం చేసుకున్నారు. వారి వైవాహిక జీవితం ప్రారంభమై నేటికి 17 సంవత్సరాలు. ఇటీవల అభిషేక్ బచ్చన్ సోలోగా విదేశాలకు వెళ్లాడు. భార్య లేకుండా తిరుగుతుండడం కూడా అనుమానం పెరగడానికి కారణం. అనంత్ అంబానీ పెళ్లిలో ఐష్ బచ్చన్ ఫ్యామిలీతో కాకుండా విడిగా రావడంతో వీరి విడాకుల వార్తలు పెద్ద దుమారం రేపాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.