Rashmika Mandanna: కుమారి నుంచి శ్రీమతిగా.. రష్మిక పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా..?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న జీవితంలో కొత్త చాప్టర్ స్టార్ట్ అయింది. ‘కుమారి’ నుంచి ‘శ్రీమతి’గా మారిన ఆమెకు అభిమానుల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. పెళ్లి తర్వాత కూడా చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్‌తో రష్మిక ఫుల్ బిజీగా ఉండనుందా..? లేక ఫ్యామిలీ లైఫ్‌కే ఫోకస్ చేస్తుందా..? అన్న చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

Rashmika Mandanna: కుమారి నుంచి శ్రీమతిగా.. రష్మిక పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా..?
Rashmika Mandanna

Edited By:

Updated on: Feb 27, 2026 | 9:18 AM

నేషనల్ క్రష్ రష్మిక మందన్న జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ‘కుమారి’ రష్మిక కాస్తా ‘శ్రీమతి’గా మారిపోవడంతో అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మందన్న ఇప్పుడు మిసెస్ దేవరకొండ అయింది. అయితే ఈ ఆనందంతో పాటే ఫ్యాన్స్ మదిలో ఒక పెద్ద సందేహం కూడా మొదలైంది. అదేంటంటే.. పెళ్లి తర్వాత రష్మిక మందన్న మళ్ళీ నటిస్తుందా..? మునుపటిలాగే గ్యాప్ లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తుందా..? లేదా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితం అవుతుందా..? అని సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ప్రస్తుతం రష్మిక చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ‘రణబాలి’ సినిమా గురించి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

విజయ్, రష్మిక జంటగా నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా ఆమె పెళ్లికి ముందే సైన్ చేసిన ప్రాజెక్ట్ అన్న సంగతి తెలిసిందే. కేవలం తెలుగులోనే కాదు, బాలీవుడ్ లో కూడా రష్మిక తన మార్క్ చూపిస్తోంది. అక్కడ షాహిద్ కపూర్ తో కలిసి ‘కాక్ టైల్ 2’ అనే రొమాంటిక్ కామెడీ సినిమాలో నటిస్తోంది. అలాగే తెలుగులో ‘మైసా’ అనే పాన్-ఇండియా యాక్షన్ మూవీలో మునుపెన్నడూ చూడని ఒక పవర్ ఫుల్ పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాలన్నీ ఆమె శ్రీమతి కాకముందే ఒప్పుకున్నవి. మరి ఈ కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తయ్యాక.. ఆమె కొత్త కథలు వింటుందా లేదా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఒకప్పుడు హీరోయిన్లకు పెళ్లైతే కెరీర్ ముగిసినట్లే అనే ముద్ర ఉండేది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండ్ పూర్తిగా మారింది.

పెళ్లి తర్వాత కూడా ఎంతో మంది స్టార్ హీరోయిన్లు తమ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ను సక్సెస్‌ఫుల్‌గా బ్యాలెన్స్ చేస్తున్నారు. రష్మిక లాంటి డెడికేషన్, నటన పట్ల ప్యాషన్ ఉన్న తార సినిమాలకు అంత సులభంగా గుడ్ బై చెప్పే అవకాశమే లేదు. పాన్ ఇండియా లెవెల్‌లో ఆమెకున్న క్రేజ్, బాక్సాఫీస్ స్టామినా దృష్ట్యా మేకర్స్ కూడా ఆమె కోసం ప్రత్యేకంగా కథలు రాసేందుకు క్యూలో ఉన్నారు. ఇవన్నీ గమనిస్తే.. పెళ్లి తర్వాత రష్మిక సినిమాలకు దూరం అవుతుందనే వార్తల్లో పెద్దగా నిజం లేదని అర్థమవుతోంది. కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి బహుశా కొద్ది రోజులు బ్రేక్ తీసుకున్నా.. ఆ తర్వాత మళ్ళీ ముఖానికి రంగేసుకోవడం ఖాయం. అయితే మునుపటిలా వచ్చిన ప్రతి సినిమా చేయకుండా.. నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చే, ప్రాధాన్యత ఉన్న సెలెక్టివ్ కథలను మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది. ఏదేమైనా రష్మిక తనదైన నటనతో మనల్ని మళ్ళీ అలరించడానికి ఖచ్చితంగా తిరిగివస్తుంది అన్నమాట..!

 

Follow Us