Triptii Dimri: ‘అసభ్యంగా ట్రోల్ చేశారు’.. ఆ సినిమా తర్వాత మూడు రోజులు ఏడ్చిన త్రిప్తి..

|

Oct 09, 2024 | 3:05 PM

‘యానిమల్‌’తో ఒక్కసారిగా ఫేమ్‌ సొంతం చేసుకుంది నటి త్రిప్తి డిమ్రి. ఆ సినిమా వల్ల తనపై వచ్చిన విమర్శల గురించి చాలా ఎమోషనల్‌ గా రియాక్ట్ అయ్యింది. యానిమల్‌ సినిమా తర్వాత త్రిప్తికి బాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి. తన చిత్రం ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.

Triptii Dimri: అసభ్యంగా ట్రోల్ చేశారు.. ఆ సినిమా తర్వాత మూడు రోజులు ఏడ్చిన త్రిప్తి..
Triptii Dimri
Follow us on

‘యానిమల్‌’తో ఒక్కసారిగా ఫేమ్‌ సొంతం చేసుకుంది నటి త్రిప్తి డిమ్రి. ఆ సినిమా వల్ల తనపై వచ్చిన విమర్శల గురించి చాలా ఎమోషనల్‌ గా రియాక్ట్ అయ్యింది. యానిమల్‌ సినిమా తర్వాత త్రిప్తికి బాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి. తన చిత్రం ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ‘యానిమల్‌’ తర్వాత తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడింది. ఆ సినిమా వల్ల ఫేమ్‌ మాత్రమే కాదు విపరీతమైన విమర్శలు చూశానని అంది. ‘‘యానిమల్‌’ విడుదలయ్యాక ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాననీ చెప్పింది. జోయాగా యాక్ట్‌ చేసినందుకు తనను చాలామంది తిట్టారనీ సోషల్‌మీడియా వేదికగా పలువురు నెటిజన్లు అసభ్యంగా ట్రోల్‌ చేశారనీ అంది. వాటిని ఎలా తట్టుకోవాలో అర్థం కాలేదనీ అలాంటి విమర్శలు ఎదుర్కొంటానని ఎప్పుడూ అనుకోలేదనీ చెప్పింది. దానినుంచి బయటకు రావడం కోసం మూడు రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నాననీ తెలిపింది. దానివల్ల బాధ కాస్త తగ్గిందనీ మనసు శాంతించిందనీ అంది. ఆ సమయంలో తన సోదరి ఎంతో సపోర్ట్‌గా నిలిచిందని చెప్పింది. మనమేం చేశామో మనకు తెలుసు కాబట్టి ఇతరుల మాటలు పట్టించుకోకు అని విధంగా ధైర్యం చెప్పిందని త్రిప్తి తెలిపింది.

రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక జంటగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన చిత్రం ‘యానిమల్‌’. యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌గా ఇది తెరకెక్కింది. జోయాగా అలరించారు త్రిప్తి డిమ్రి. కథలో భాగంగా ఆమెపై కొన్ని ఇంటిమేట్‌ సీన్స్‌ చిత్రీకరించారు. ఆ సీన్స్‌పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా తర్వాత త్రిప్తికి దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ‘నేషనల్‌ క్రష్‌’ అని ట్యాగ్‌ ఇచ్చారు.

అభిమానులు చూపిస్తోన్న ప్రేమపై గతంలో ఓ సందర్భంలో క్లియర్ కట్ గా మాట్లాడింది త్రిప్తి డిమ్రి. బాలీవుడ్‌లో కెరీర్‌ మొదలుపెట్టి దాదాపు ఏడేళ్లు అయ్యిందనీ అందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. గొప్ప నటీనటులు, దర్శకులతో వర్క్‌ చేస్తానని కెరీర్‌ ఆరంభంలో ఎప్పుడూ అనుకోలేదనీ అంది. ‘లైలా మజ్ను’ తర్వాత నటనలో శిక్షణ తీసుకున్నట్లు తెలిపింది. ప్రేక్షకులు తన నటనతో కనెక్ట్‌ అవుతున్నారనీ నేషనల్‌ క్రష్‌ అనేది తన దృష్టిలో ట్యాగ్‌ మాత్రమే కాదు అభిమానుల ప్రేమ అంది. వాళ్లు తనను అలా పిలుస్తున్నందుకు ఆనందంగా ఉన్నట్లు చెప్పింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.