
అందాల భామ సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగు, తమిళ్ తోపాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఎలాంటి స్కిన్ షో చేయకుండా స్టార్ డమ్ సొంతం చేసుకోవడంతో పాటు విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది సాయి పల్లవి. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోతుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది సాయి పల్లవి. ముఖ్యంగా తెలంగాణ అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించి అలరించింది. కాగా తెలుగులో చివరిగా తండేల్ సినిమాలో నటించింది ఈ చిన్నది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో రామాయణం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా సాయి పల్లవి సీతపాత్రలో ఆకట్టుకోనుంది. రామాయణం సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకురానుంది.
రామాయణం సినిమా కంటే హిందీలో ముందు ఏక్ దిన్ అనే సినిమాలో నటించింది. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ హీరోగా నటించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఏక్ దిన్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. విడుదలైన దగ్గర నుంచి ఈ సినిమాకు మిక్స్ టాక్ వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఏక్ దిన్ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఏక్ దిన్ చేయడానికి మెయిన్ కారణం కథ. మూవీ టీమ్ నన్ను సంప్రదించినప్పుడు నాకు ఎమోషనల్ స్టోరీ చేయాలనుకున్నా.. అందుకే మనసుకు హాయిగా అనిపించే పాత్రలు చేయాలనుకున్నా. షూటింగ్ లో కూడా నాకు ఎలాంటి మెంటల్ ప్రజర్ లేకుండా ఉండే కథ చేయాలని అనుకున్నా.. ఈ సినిమా కథ విన్నప్పుడు హాలీవుడ్ మూవీ బిఫోర్ సన్‌రైజ్గుర్తుకొచ్చింది. అందుకే వెంటనే సినిమాకు ఓకే చేశా.. అని తెలిపింది. తీరా ప్రీమియర్ షో చూసిన తర్వాత ఈ పాత్రకు నేను సరిపోలేదని నాకు అనిపించింది. ఇదే మాట ఆమిర్ ఖాన్‌తో కూడా చెప్పా. ‘ఈ పాత్రకు నన్ను కాకుండా మరొకరిని సెలక్ట్ చేసి ఉంటే బాగుండేదేమో. చలాకీగా, యాక్టివ్ గా ఉండే కొత్త అమ్మాయిని సెలక్ట్ చేసి ఉండాల్సింది అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.