Renu Desai: గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్ .. ఇదంతా పరమశివుని ఆశీర్వాదమేనంటూ ఎమోషనల్ పోస్ట్

నాలుగేళ్ల క్రితం రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు నటి రేణూ దేశాయ్. అందులో హేమలతా లవణం అనే ఓ కీలక పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారామె. ఇక గతేడాది బ్యాడ్ గర్ల్స్ అనే మరో సినిమాలో ఓ కీలక పాత్రతో ఆకట్టుకున్నారీ సీనియర్ నటి.

Renu Desai: గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్ .. ఇదంతా పరమశివుని ఆశీర్వాదమేనంటూ ఎమోషనల్ పోస్ట్
Actress Renu Desai

Updated on: Jun 14, 2026 | 7:00 AM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ నటీమణుల్లో రేణూ దేశాయ్ ఒకరు. బద్రి, జానీ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసిన పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గానూ పని చేశారు. అలాగే ఓ మరాఠీ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. అయితే పెళ్లి పిల్లల తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైందీ అందాల తార. చాలా ఏళ్ల పాటు కెమెరాకు దూరంగా ఉండిపోయింది. అయితే సుమారు నాలుగేళ్ల క్రితం రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారామె. అందులో హేమలతా లవణం అనే ఓ కీలక పాత్ర పోషించి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే సినిమా పెద్దగా ఆడలేదు. దీని తర్వాత నటిగా రేణూ దేశాయ్ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతారనుకున్నారు చాలా మంది. కానీ అదేమీ జరగలేదు. టైగర్ నాగేశ్వరరావు తర్వాత ఆమె మళ్లీ సినిమా చేయడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. గతేడాది బ్యాడ్ గర్ట్స్ అనే ఓ సినిమాలో కనిపించారీ అందాల తార.

తాజాగా మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రేణూదేశాయ్. ఈ మేరకు తన తదుపరి సరికొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారామె. అడ్వర్టైజింగ్ రంగంలో రాక్‌స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యమునా కిషోర్ ఈ సినిమా ద్వారా తొలిసారిగా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సంకర్ ఇందుచూదన్ ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్టులో రేణూ దేశాయ్ ఒక కీలకమైన పాత్ర పోషించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన రేణూ దేశాయ్.. ‘యమునా కిషోర్ దర్శకత్వంలో పని చేయడం, అలాగే అద్భుతమైన నటుడైన సంకర్ ఇందుచూదన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు సూపర్ ఎగ్జైటింగ్‌గా ఉంది. వీటన్నింటికీ మించి మహాదేవుని నగరమైన కాశీలో ఈ చిత్ర షూటింగ్ జరుపుకోవడం నిజంగా ఆ పరమశివుని ఆశీర్వాదంగా భావిస్తున్నాను’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గామారింది. అయితే ఈ సినిమా కథ, టైటిల్ తదితర విషయాలకు సంబంధించి త్వరలోనే అప్ డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

రేణూ దేశాయ్ షేర్ చేసిన పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us