Priyamani: నేను మతం మారాను.. ఇంత ద్వేషం ఎందుకో అర్థం కావడం లేదు: ప్రియమణి

| Edited By: Ravi Kiran

Oct 16, 2024 | 8:28 AM

ప్రియమణి తన ఫ్యామిలీ లైఫ్ గురించి మాట్లాడింది. అలాగే తన వివాహం గురించి కూడా మాట్లాడింది.  ప్రియమణి 1984 జూన్ 4న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. ఈ అమ్మడి స్వస్థలం కేరళలోని పాలక్కాడ్. ప్రియమణి బెంగళూరులో పాఠశాల విద్యను అభ్యసించింది. స్కూల్లో చదువుతున్నప్పుడే వాణిజ్య ప్రకటనల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.  

Priyamani: నేను మతం మారాను.. ఇంత ద్వేషం ఎందుకో అర్థం కావడం లేదు: ప్రియమణి
Priymani
Follow us on

ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా రాణించింది అందాల భామ ప్రియమణి. తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక తెలుగులో పెళ్ళైన కొత్తలో సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది. పరుత్తి వీరన్ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న ఘనత కూడా ఈ ముద్దుగుమ్మ సొంతం. అటు వెండితెర, ఇటు బుల్లితెరపై దూసుకుపోతోన్న ప్రియమణి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ప్రియమణి ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా ఉంటోంది. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు ఇటీవలే హిందీలోనూ సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో నటించింది.

ఇదిలా ఉంటే తాజాగా ప్రియమణి తన ఫ్యామిలీ లైఫ్ గురించి మాట్లాడింది. అలాగే తన వివాహం గురించి కూడా మాట్లాడింది.  ప్రియమణి 1984 జూన్ 4న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. ఈ అమ్మడి స్వస్థలం కేరళలోని పాలక్కాడ్. ప్రియమణి బెంగళూరులో పాఠశాల విద్యను అభ్యసించింది. స్కూల్లో చదువుతున్నప్పుడే వాణిజ్య ప్రకటనల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.  ప్రియమణి 2003లో విడుదలైన తెలుగు సినిమాతో  సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. 2004లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన “కన్ నీలాల్ అయుత్ సే” చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో  అడుగుపెట్టింది.

తమిళం, తెలుగు, కన్నడ, హిందీ వంటి పలు భాషల్లో నటిస్తూ భారతీయ చిత్రసీమలో కూడా తనకంటూ ఒక శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంది ప్రియమణి. మనోజ్ బాజ్‌పేయికి జోడీగా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్‌ తో బాలీవుడ్‌లో క్రేజ్ సొంతం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూనే ఉన్న ప్రియమణి ప్రస్తుతం తమిళంలో కొటేషన్ గ్యాంగ్ అనే చిత్రంలో నటిస్తోంది. హిందీ, తెలుగు, కన్నడ భాషా చిత్రాలలో ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం, నటి ప్రియమణి తమిళంలో  విజయ్ చివరి చిత్రం దళపతి 69 లో నటించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియమణి నటిస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ముస్లింను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియమణిపై పలువురు విమర్శలు గుప్పించారు. దీని పై ఆమె స్పందిస్తూ.. నా పిల్లలు ఉగ్రవాదులు అవుతారంటూ చేసిన వ్యాఖ్యలను చేశారు. మతంతో సంబంధం లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. దాని మీద ఇంత ద్వేషం ఎందుకో అర్థం కావడం లేదు. నేను ఈద్ రోజున ఒక పోస్ట్ చేసాను. వెంటనే మీరు ఇస్లాంలోకి మారారా అని కామెంట్స్  చేస్తున్నారు. నేను మతం మారానని నీకు తెలుసా?.. ఏది ఏమైనా అది నా నిర్ణయం. పెళ్లికి ముందు నా భర్తతో ‘నేను హిందువుగా పుట్టాను, పుట్టాక నా విశ్వాసాన్ని పాటిస్తానని చెప్పాను’ అని తెలిపింది ప్రియమణి.