ఎవ్వరిమీద లవ్వు లేదు… అసలు అబ్బాయిలే వద్దు..! జోవికా విజయ్ కుమార్ ఓపెన్ కామెంట్స్

నటి జోవికా విజయకుమార్ ప్రేమ, సంబంధాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. నేటి తరం ప్రేమ కేవలం ఒక పాసింగ్ క్లౌడ్ లాంటిదని, అన్నింటినీ ప్రేమగా లేబుల్ చేయడం సమస్యకు మూలమని ఆమె అన్నారు. ప్రస్తుతానికి తాను సంబంధాలకు దూరంగా ఉన్నానని, తన కెరీర్‌పైనే దృష్టి సారించానని స్పష్టం చేశారు.

ఎవ్వరిమీద లవ్వు లేదు... అసలు అబ్బాయిలే వద్దు..! జోవికా విజయ్ కుమార్ ఓపెన్ కామెంట్స్
Jovika

Updated on: Aug 13, 2026 | 8:11 PM

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న నటి వనిత విజయ్ కుమారు. ఇప్పుడు ఆమె కూతురు జోవికా విజయకుమార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తున్నారు. అగాధ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు జోవికా. కాగా గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో.. ప్రేమ, సంబంధాలపై తన ఆసక్తికరమైన, స్పష్టమైన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుత జనరేషన్‌లో ప్రేమ అనేది కేవలం ఒక పాసింగ్ క్లౌడ్ లా మారిపోయిందని, దానికి ఎటువంటి స్థిరత్వం ఉండటం లేదని ఆమె అన్నారు. సోషల్ మీడియాలో నిత్యం అనేక ఘటనలు చూస్తున్నామని ఆమె అన్నారు.

ఇది కూడా చదవండి: అమ్మబాబోయ్..! మేడం ఇది మీరేనా..!! సింధుతులాని ఇప్పుడు ఎంత మారిపోయింది

“నేను ప్రేమకు, రొమాంటిక్ సంబంధాలకు చాలా చాలా దూరంగా ఉంటాను” అని జోవికా స్పష్టం చేశారు. బహుశా అన్నింటినీ ప్రేమ అని లేబుల్ చేయడమే సమస్యకు మూలమని ఆమె చెప్పుకొచ్చారు. ఒక  షారుఖ్ ఖాన్, ఆలియా భట్ నటించిన సినిమాలో ఒక సీన్ ఉంటుందని, అందులో ఒక థెరపిస్ట్ సోఫా గురించి ఒక ఉదాహరణ ఇస్తారని ఆమె గుర్తు చేశారు. ఒక సోఫా కొనేటప్పుడు ఎన్ని సార్లు దానిపై కూర్చొని, అది బాగుందా లేదా అని పరిశీలిస్తామో, అలాగే శాశ్వతంగా కలిసి జీవించాలనుకునే భాగస్వామిని ఎంచుకోవడంలో కూడా అంతకంటే ఎక్కువ జాగ్రత్త వహించాలని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :అయ్యో.. ఫోన్ ఎంతపని చేసింది..!! హాస్పటల్ పాలైన అందాల నటి.. కారణం తెలిస్తే షాక్ ఆడుతారు

అయితే, ప్రారంభ దశలోనే ప్రతి సంబంధాన్ని ప్రేమ అని లేబుల్ చేసి, ఆ తర్వాత విఫలమైతే అది నిరాశకు దారితీస్తుందని ఆమె పేర్కొన్నారు. సంబంధాలు ఏర్పరచుకోవడంలో, వాటిని ప్రయత్నించడంలో తప్పు లేదని, అలా చేస్తేనే తమకు ఏం కావాలి, ఏం వద్దు అనేది తెలుస్తుందని, అప్పుడు బలంగా ఉండే సంబంధాలు ఏర్పడతాయని జోవికా చెప్పుకొచ్చింది. అదేవిధంగా ఒక అబ్బాయిలో తనకు కావాల్సిన క్వాలిటీస్ ఏమిటి అని అడిగినప్పుడు, ప్రస్తుతం తాను ఎవరినీ ఇష్టపడలేదని, అసలు అబ్బాయిలే వద్దని ఆమె స్పష్టం చేశారు. తన తల్లి కూడా తన స్నేహితులకు ఈ విషయమే చెబుతుందని, ప్రస్తుతం తనకు సంబంధాలపై ఎటువంటి ఆసక్తి లేదని, తన సొంత విషయాలు, కెరీర్ పైనే దృష్టి సారించానని ఆమె తెలిపారు.

ఇది కూడా చదవండి :జెన్ జీలకు తెగ నచ్చేసిన సినిమా ఇదే.. ఒక్కసారి చూస్తే మీరూ వదిలిపెట్టారు.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us