Janhvi kapoor: నా జీవితానికి అర్ధం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే : జాన్వీ కపూర్

ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. జూన్ 4న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది..

Janhvi kapoor: నా జీవితానికి అర్ధం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే : జాన్వీ కపూర్
Janhvi Kapoor

Updated on: Jun 01, 2026 | 9:44 PM

మెగా స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. జూన్ 4న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా పీ రిలీజ్ ఈవెంట్ ను విజయవాడలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నటుడు జాన్వీ మాట్లాడుతూ..మాట్లాడుతూ.. తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. మీరు మా పై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పెద్ది సినిమా పై కూడా ఇదే ప్రేమ చూపిస్తారని అనుకుంటున్నా.. ఈ సినిమా చాలా స్పెషల్.. ఈ సినిమాలో చాలా విషయం ఉంది.. మీ జీవితానికి అర్ధం ఏంటి అనేది ఈ సినిమాలో చూస్తారు.

నా జీవితానికి అర్ధం మిమ్మల్ని అలరించడం, సినిమాలు చేయడం.. నా ఐడెంటిటీ ఈ భూమితో, మీతో కనెక్ట్ అయ్యి ఉంది. మేము చేసిన ఈ సినిమా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా.. ఈ సినిమా నాకు చాలా ఇచ్చింది. చరణ్ తో నటించే ఛాన్స్ ఇచ్చింది.. బుచ్చి బాబు నాకు తెలిసిన మోస్ట్ ప్యాషినేట్ డైరెక్టర్.. సినిమా టీమ్ అందరూ సినిమా కోసం బెస్ట్ ఇచ్చారు.. మీరందరూ ఇలా వస్తే మా కష్టానికి ఫలితం దక్కిందని అనుకుంటున్నా.. అంటూ అద్భుతంగా తెలుగులో మాట్లాడింది జాన్వీ. ప్రేక్షకులు దేవుళ్ళు అని మా అమ్మ చెప్తుంటుంది. జగదేకవీరుడు సినిమాలోని శ్రీదేవి చెప్పిన డైలాగ్ చెప్పిన జాన్వీ..

 

Follow Us