Hema : డబ్బుల కోసం ఏ పనైనా చేస్తా.. కానీ అది తప్ప.. హేమ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ లో హేమ మంచి గుర్తింపు తెచ్చుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది ఆమె. అమ్మగా, అత్తగా, వదిన పాత్రల్లో నటించి మెప్పించింది. అలాగే కామెడీ టచ్ ఉన్న పాత్రల్లో ఎక్కువగా నటించి నవ్వులు పూయించింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించిన హేమ.. తాజాగా రేవ్ పార్టీలో ఇరుక్కొని బాగా పాపులర్ అయ్యింది.

Hema : డబ్బుల కోసం ఏ పనైనా చేస్తా.. కానీ అది తప్ప.. హేమ షాకింగ్ కామెంట్స్
Hema
Follow us

|

Updated on: Jun 17, 2024 | 4:53 PM

టాలీవుడ్ నటి హేమ వ్యవహారం ఈ మధ్య వార్తల్లో తెగ వినిపిస్తుంది. రేవ్ పార్టీ  కేసులో నటి హేమ  అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాను రేవ్ పార్టీకి వెళ్ళలేదని, హైదరాబాద్ లోనే ఉన్నాను అని హేమ తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా పోలీసులు విచారణ ఆధారంగా ఆమెను అరెస్ట్ చేశారు. అలాగే హేమ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా నిర్ధారణ అయ్యింది. తాజాగా ఆమె బెయిల్ పై బయటకు కూడా వచ్చేసింది. టాలీవుడ్ లో హేమ మంచి గుర్తింపు తెచ్చుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మేపించింది ఆమె. అమ్మగా, అత్తగా, వదిన పాత్రల్లో నటించి మెప్పించింది. అలాగే కామెడీ టచ్ ఉన్న పాత్రల్లో ఎక్కువగా నటించి నవ్వులు పూయించింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించిన హేమ.. తాజాగా రేవ్ పార్టీలో ఇరుక్కొని బాగా పాపులర్ అయ్యింది.

అయితే హేమ కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే వందల కోట్లు ఎలా సంపాదించింది.? బీఎండబ్ల్యూ కారు ఎలా కొన్నది.? అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ విషయం పై గతంలో ఓ ఇంటర్వ్యూలో హేమ మాట్లాడింది. అందరూ అనుకుంటున్నట్టు తనకు వందల కోట్ల ఆస్తి లేదని తెలిపింది. అలాగే డబ్బు సంపాదన గురించి హేమ మాట్లాడుతూ.. తనకు డబ్బు సంపాదించడానికి ఉన్న మార్గం సినిమా మాత్రమే కాదు అని తెలిపింది.

అలాగే తన సంపాదనకు ఆధారం కేవలం సినిమా మాత్రమే కాదు అని తెలిపిన హేమ తన ఫ్యామిలీ మొదటి నుంచి రిచ్ అని తెలిపింది. మా అమ్మకి, నాకు ఒంటి నిండా పెట్టుకోవడానికి నగలు ఉన్నాయి. కేవలం సినిమాల మీదే ఆధారపడి ఉంటే ఇంత డబ్బు నాకు ఉండేది కాదు అని తెలిపింది. అలాగే ఊర్లో తమకు చాలా ఆస్తులు ఉన్నాయని, తన భర్త కూడా బాగా సంపాదిస్తాడని తెలిపింది అలాగే తాను కూడా చిట్టీలు లాంటి వ్యాపారాలు చేస్తానని అందుకే తన లైఫ్ హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చింది హేమ. అలాగే పని విషయంలో తనకు చిన్న చూపు లేదని.. డబ్బుకోసం ఏ పనైనా చేస్తానని కానీ తల దించుకునే పనులు మాత్రం అస్సలు చేయను అని అన్నారు హేమ. అలాగే ఎంత డబ్బు సంపాదించినా.. గంజి నీళ్లు తాగి బ్రతికేస్తా.. కారఅడవిలో వదిలేసినా దర్జాగా బతుకుతా.. నాకు లగ్జరీ లైఫ్ అవసరం లేదు అని హేమ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by KOLLA HEMA (@hemakolla1211)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.