KGF-2 Movie: విడుదలకు ముందే కేజీఎఫ్- 2 రికార్డ్స్… ఆడియో రైట్స్‏కు భారీగా డిమాండ్.. పెద్ద మొత్తం చెల్లించిన..

|

Jul 02, 2021 | 9:52 PM

ప్రస్తుతం కాలంలో సినిమా విడుదలకు ముందే వాటి రేట్‏ను డిసైడ్ చేసేస్తున్నారు మేకర్స్. ఇక ముందు నుంచి బజ్ ఎక్కువగా ఉన్న సినిమాలు భారీగానే వసూలు చేస్తున్నాయి.

KGF-2 Movie: విడుదలకు ముందే కేజీఎఫ్- 2 రికార్డ్స్... ఆడియో రైట్స్‏కు భారీగా డిమాండ్.. పెద్ద మొత్తం చెల్లించిన..
Kgf 2
Follow us on

ప్రస్తుతం కాలంలో సినిమా విడుదలకు ముందే వాటి రేట్‏ను డిసైడ్ చేసేస్తున్నారు మేకర్స్. ఇక ముందు నుంచి బజ్ ఎక్కువగా ఉన్న సినిమాలు భారీగానే వసూలు చేస్తున్నాయి. పెట్టుబడితో సంబంధం లేకుండా.. రెట్టింపును దక్కించుకుంటున్నాయి. థ్రియేట్రికల్ రైట్స్ నుంచి.. డిజిటల్, శాటిలైడ్ రైట్స్ ఇలా ప్రతిదాన్ని భారీగా ఆదాయం వెచ్చంది రైట్స్ దక్కించుకుంటున్నాయి నిర్మాణ సంస్థలు. హీరో డైరెక్టర్ ఫేమ్ తో వచ్చే మనీ ఇప్పుడు సినిమా బడ్జెట్ కు మించిపోతున్నాయి. ఇక ప్రస్తుతం మార్కెట్లో సినిమాతో సంబంధం లేకుండా.. అందులోని పాటలు కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. మూవీ హిట్ కాకపోయిన .. పాటలు మాత్రం సూపర్ హిట్ అందుకుంటున్నాయి. అందుకే ప్రస్తుతం సినిమా మ్యూజిక్ రైట్స్ కూడా భారీగానే ఉంటున్నాయి.

ఇక కేజీఎఫ్ సిక్వెల్ గా తెరకెక్కుతున్న కేజీఎఫ్ 2 సినిమా కూడా ప్రారంభం నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. కన్నడ సూపర్ స్టార్ యశ్ హీరోగా పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందిన కేజీఎఫ్ 2 సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నెలలో విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచి పోయింది. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ ఓటీటీ ఇలా అన్ని రైట్స్ రికార్డ్ ధర దక్కుతోంది. తాజాగా ఈ మూవీ ఆడియో రైట్స్ ను లహరి, టీ సీరిస్ వారు సంయుక్తంగా రూ. 7.2 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

కేజీఎఫ్ 2లో ఆరు పాటలు కూడా మాస్ ఆడియన్స్‏ను ఆకట్టుకునే బీట్స్ ఉన్నాయని టాక్. అందుకే ఈ మూవీ ఆడియో రైట్స్ భారీ ధర వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక కేజీఎఫ్ చిత్రానికి ఇంతగా ధర వస్తే.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు రూ. 10 కోట్లు రావడం ఖాయమంటున్నారు. రాబోయే కాలంలో సినిమా కంటే ఆడియో రైట్స్ ఎక్కువగా ధర వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. యూట్యూబ్, మ్యూజిక్ యాప్స్, వెబ్ సైట్స్‏తోపాటు.. రేడియాలలో కూడా సాంగ్స్ వినేవారు అధికంగా ఉంటారు. ఇందుకు సదరు సంస్థలు.. పాటల కోసం ఆడియో రైట్స్ తీసుకున్నవారికి కొంత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: World Photos: కల సాకారమైంది.. ఆకాశంలో ఎగురుతున్న కారు.. నిమిషాల్లోనే ప్రయాణం.. ఫోటోలు వైరల్..

Gadget Insurance: ఖరీదైన ఫోన్.. విలువైన గాడ్జెట్ లు ఉన్నాయా? మరి బీమా చేయించారా? ఏమిటో తెలీదా..ఇప్పుడు తెలుసుకోండి!