
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. గతంలో ఆయన నటించిన ఏ, రా, ఉపేంద్ర, రక్త కన్నీరు తదితర సినిమాలు కల్ట్ స్టేటస్ సొంతం చేసుకున్నాయి. ఆ మధ్యన హీరో రామ్ పోతినేని నటించిన ఆంధ్రా కింగ్ తాలుకాలోనూ ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం హీరోగానూ, విలన్ గానూ, సహాయక నటుడిగానూ బిజీ బిజీగా ఉంటోన్న ఉపేంద్ర ఇంట్లో శుభాకార్యం జరిగింది. ఆయన అన్న కుమారుడు, హీరో నిరంజన్ సుధీంద్ర నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. డాక్టర్ సంజనా రాణితో కలిసి నిరంజన్ ఉంగరాలు మార్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువరు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా ఉపేంద్ర అన్న కొడుకు అయిన నిరంజన్ కూడా నటుడిగా రాణిస్తున్నాడు. 2018లో సెకండాఫ్ అనే మూవీతో హీరోగా పరిచయమయ్యాడు నిరంజనన్. ఆ తర్వాత 2022లో రిలీజైన ‘నమ్మ హుడుగురు’ మూవీలోనూ కథానాయకుడిగా ఆకట్టుకున్నాడు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన సీతా పయనం సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తెరకెక్కిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కానీ ఈ మూవీ యూత్ ను మాత్రం బాగా ఆకట్టుకుంది.
ఇక నిరంజన్ కు కాబోయే భర్య విషయానికి వస్తే.. ఆమె ఓ ప్రముఖ డాక్టర్ అని తెలుస్తోంది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుస్తోంది. త్వరలోనే నిరంజన్- సంజన ల పెళ్లి వేడుక జరగనుట్లు తెలుస్తోంది. వీరి నిశ్చితార్థం వేడుకకు సతీసమేతంగా హాజరయ్యాడు ఉపేంద్ర. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉప్పీ సతీమణి నటి ప్రియాంక సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. కాబోయే దంపతులకు అభినందనలు తెలిపింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.