దొంగ ప్రియ‌దర్శి, తండ్రి ఏటీఎం కార్డు నుంచి

|

Sep 02, 2020 | 3:34 PM

ప్ర‌స్తుతం తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌లో క‌మెడియ‌న్ ప్రియ‌ద‌ర్శి త‌న జోరు చూపిస్తున్నాడు. వ‌ర‌సగా అగ్ర తార‌ల సినిమాల్లో ఛాన్సులు ప‌ట్టేస్తూ అద‌ర‌గొడుతున్నాడు.

దొంగ ప్రియ‌దర్శి,  తండ్రి ఏటీఎం కార్డు నుంచి
Follow us on

ప్ర‌స్తుతం తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌లో క‌మెడియ‌న్ ప్రియ‌ద‌ర్శి త‌న జోరు చూపిస్తున్నాడు. వ‌ర‌సగా అగ్ర తార‌ల సినిమాల్లో ఛాన్సులు ప‌ట్టేస్తూ అద‌ర‌గొడుతున్నాడు. 2016 విడుద‌లైన విజ‌య్ దేవ‌ర‌కొండ పెళ్లి చూపులు సినిమా ద్వారా ప్రియ‌దర్శి మంచి ఖ్యాతి గ‌డించాడు. ఆ త‌ర్వాత జై ల‌వకుశ‌, స్పైడ‌ర్ వంటి సినిమాల్లో క‌నిపించి న‌వ్వులు పూయించాడు. తాజాగా ఇత‌గాడు ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే అలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మానికి హాజ‌రై త‌న గురించి చాలా విషయాలు చెప్పాడు. ఇందుకు సంబంధించిన ప్రొమో విడుద‌లయ్యింది. వ‌చ్చే ఆదివారం పూర్తి ఎపిసోడ్ ప్ర‌సారం కానుంది. తాజాగా విడుద‌ల చేసిన ప్రోమో కూడా చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంది. అందులో త‌న వ‌ద్ద డబ్బులు లేన‌ప్పుడు త‌న తండ్రి ఏటీఎం కార్డు నుంచి రూ.50, రూ.100 తస్క‌రించేవాడినని చెప్పుకొచ్చాడు ప్రియ‌ద‌ర్శి. ఇప్ప‌ట్లాగా కొన్ని సంవ‌త్స‌రాల క్రితం డ‌బ్బులు తీసిన వెంట‌నే ఫోన్‌కు మేసేజ్‌లు వ‌చ్చేవి కాదని, అందుకే అప్పుడు ఆ ఫార్ములా వ‌ర్కువుట‌యిన‌ట్లు చెప్పాడు. పాస్‌బుక్ ప్రింట్ తీసిన‌ప్పుడు త‌నకు రౌండ్ ప‌డేద‌ని వివ‌రించాడు. కాగా ఆ తస్క‌రించిన డబ్బును కూడా ప్రియ‌ద‌ర్శి సినిమాలు చూడ‌టానికే వినియోగించేవాడ‌ట‌.

Also Read :

ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ : హైకోర్టు కీలక ఆదేశాలు

కృష్ణా జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న పాముకాటు కేసులు