పవన్ కొత్త సినిమాలో మలయాళీ భామ!

| Edited By:

May 13, 2020 | 2:56 PM

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కనున్న 'పవన్ 28' సినిమాలో ఓ మలయాళ బ్యూటీ నటించబోతుందంటూ ఓ న్యూస్ గత కొద్ది రోజులుగా వైరల్ అవుతోంది. ఈ మధ్య పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వీపరీతంగా..

పవన్ కొత్త సినిమాలో మలయాళీ భామ!
Follow us on

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కనున్న.. ‘పవన్ 28’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో ఓ మలయాళ బ్యూటీ నటించబోతుందంటూ ఓ న్యూస్ గత కొద్ది రోజులుగా వైరల్ అవుతోంది. ఈ మధ్య పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వీపరీతంగా ట్రోల్ అవుతోన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి ‘పవన్ 28’ (వర్కింగ్ టైటిల్). ఇందులో మలయాళీ భామ ఎంపికైనట్లు కొన్ని వార్తలు ట్రోల్ అవుతున్నాయి. ఈ పవన్, హరీష్ కాంబోలో వస్తున్న సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దీనికి ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్దే వీశ్రీ ప్రసాద్‌ కూడా కన్ఫామ్ అయ్యాడు. అలాగే హీరోయిన్ కోసం కూడా చిత్ర బృందం చర్చలు ప్రారంభించారట.

ఈ నేపథ్యంలో మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన మానస రాధాకృష్ణన్ ‘పవన్ 28’లో నటిస్తుందంటూ పలు వార్తలొస్తున్నాయి. బాలనటిగా చిత్రపరిశ్రమకు పరిచయమమైన మానస.. పలు షార్ట్ ఫిల్మ్‌తో పాటు, ఓ తమిళ సినిమాలోనూ కనిపించింది. ఏది ఏమైనా ఈ అమ్మడు ఫొటోలు మాత్రం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి పవన్‌తో నటించే విషయంలో ఎంత నిజం ఉందో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

Read More:

బస్సుల్లో మారిన సీట్లు.. ఏపీఎస్‌ఆర్టీసీ‌లో కొత్త మోడల్

రెండో భార్యతో దిల్ రాజు ఫస్ట్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న పిక్

అమెరికాలో కలకలం.. పిల్లల్లో కొత్తరకమైన కోవిడ్.. 100 మంది పిల్లలు!