Sapthagiri New Movie: సప్తగిరి నూతన సంవత్సర కానుక… విడుదల కానున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్…

| Edited By:

Jan 01, 2021 | 5:26 AM

తెలుగులో ప్రముఖ హాస్య నటుడు సప్తగిరి నుంచి నూతన సంవత్సర కానుక రానుంది. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జనవరి1, 2021న మధ్యాహ్నం విడుదల చేయనున్నారు.

Sapthagiri New Movie: సప్తగిరి నూతన సంవత్సర కానుక... విడుదల కానున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్...
Follow us on

New Year 2021: తెలుగులో ప్రముఖ హాస్య నటుడు సప్తగిరి నుంచి నూతన సంవత్సర కానుక రానుంది. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జనవరి1, 2021న మధ్యాహ్నం విడుదల చేయనున్నారు. కాగా, సప్తగిరి కమెడియన్‌గా కాకుండా హీరోగా కొన్ని సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీలు అంటూ హీరోగా మెప్పించాడు. హీరోగా కూడా మంచి పేరు సంపాదించిన సప్తగిరి. ఇటీవల మరో సినిమాను మొదల పెట్టాడు. ఈ సినిమా ఇల్యూజన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జనవరి నెలలో ప్రారంభం కానుంది.

 

 

ఈ సినిమాను రిజ్వానా ఎంటర్‌టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. దీనికి ఎయిట్ అనే పేరును ఖరారు చేశారు. అయితే నూతన సంవత్సర కానుకగా జనవరి 1 మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాను మొత్తం నాలుగు భాషల్లో తెరకెక్కించనున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. దాంతో పాటుగా థ్రిల్లర్ సినిమాలో సప్తగిరి ఎలా చేయనున్నాడని ప్రేక్షకులు ఎదురు చేస్తున్నారు.

 

Also Read:

Ali and Naresh New Year Wishes : వినూతనంగా విషెస్ తెలిపిన అలీ, నరేష్ .. ఏం చేసారంటే..