బిగ్‌బాస్ ఇంట్లో ఎప్పుడు ఏం జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. హౌస్‌లోకి వెళ్లక ముందు పాపులారిటీ ఉన్నవాళ్లు.. తమ ప్రవర్తనతో నెగిటివ్‌గా మారిపోవచ్చు.. ఎలాంటి గుర్తింపు లేనివాళ్లు హీరోలుగా మారిపోవచ్చు. అయితే వారం వారం కంటెస్టెంట్స్ స్వభావాలు.. ప్రవర్తన బట్టి ఆడియన్స్ వారికి మద్దతు ఇచ్చే విధానం మారుతుంది. అయితే ఇక కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు కూడా ఓటింగ్ పై ప్రభావం చూపిస్తాయి. నటి ప్రియ విషయంలోనూ అదే జరిగింది. ముందు నుంచి ఓటింగ్ లిస్ట్‌లో టాప్ లో ఉన్న ప్రియ.. ఉన్నట్టుండి ఏడోవారం ఎలిమినేట్ అయ్యింది. అయితే ముందు నుంచి ప్రియ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు మిగిలిన హౌస్ మేట్స్. అందులోనూ… సన్నీతో పదే పదే గొడవ పెట్టుకుంటూ ముక్కుసూటిగా మాట్లాడుతూ వచ్చింది ప్రియా..
ఇక రవి.. లహరి గొడవలో తప్పు రవిది అని రుజువు కావడంతో ప్రియకు మద్దతు భారీగా పెరిగిపోయింది. ప్రతివారం నామినేట్ అవుతున్నా.. తనను ఎలిమినేట్ కాకుండా కాపాడుతూ వచ్చారు ఆడియన్స్. అయితే మొన్నటి ఎపిసోడ్లో ప్రియ ప్రవర్తనే ఆమె కొంపముంచింది. సన్నీతో ప్రతి సారి గొడవ పడడం సాధారణంగానే అనిపించిన.. మొన్నటి ఎపిసోడ్లో మాత్రం ప్రియ శ్రుతిమించి ప్రవర్తించింది. దీంతో ప్రేక్షకులకు విసుగు కలిగిలా చేసింది. బంగారు కోడి పెట్ట అనే టాస్కులో సన్నీని టార్గెట్ చేసింది ప్రియ. ప్రతి సారి అతని గుడ్లను దొంగిలిస్తూ.. కావాలనే అతన్ని రెచ్చగొట్టింది. నువ్వు మగాడివే కాదు.. నా ముందు మాట్లాడు.. నేను నీ గుడ్లనే దొంగిలిస్తాను.. ఏం చేసుకుంటావో చేసుకో… నీలాంటి వాళ్లను చాలా మందిని చూశాను అంటూ దారుణంగా రెచ్చగొట్టింది. ఇక అదే టాస్కులో పిచ్చిగా నవ్వడం.. సన్నీని రెచ్చగొడుతూ మాట్లాడటం చేసింది. దీంతో ప్రియ ప్రవర్తన చూసిన ఆడియన్స్ ఒక్కసారిగా షాకయ్యారు.. ఇనాళ్లు ముక్కుసూటిగా మాట్లాడుతూ గేమ్ ఆడిన ప్రియ ప్రవర్తనకు ఆమెకు ఓట్లు వేయడం తగ్గించేశారు… దీంతో డేంజర్ జోన్లో ఉన్న యానీ మాస్టర్ కాకుండా… ప్రియ ఎలిమినేట్ అయ్యింది. మొత్తానికి ఒక్కరోజు ఎపిసోడ్లో ప్రియ శ్రుతిమించిన ప్రవర్తన ఆమెను హౌస్ నుంచి బయటకు వచ్చేలా చేసింది.
Samantha: సమంతకు అమ్మ చెప్పిన మాట ఇదే.. అందుకే అంత ధైర్యం ఆమెకు!.. వైరల్ అవుతున్న పోస్ట్..