Cinema Theaters : ప్రభుత్వం స్పందించకపోతే నిరాహరా దీక్షలే అంటోన్న తెలంగాణ థియేటర్ల ఓనర్లు

|

Mar 03, 2021 | 3:17 PM

Cinema Theater owners : డిమాండ్లు పరిష్కరించకపోతే నిరాహార దీక్షకు దిగుతామంటున్నారు తెలంగాణ థియేటర్ల ఓనర్లు. లాక్‌డౌన్ తర్వాత సినిమాహాళ్లు మూతపడ్డాయి. ఆంక్షల సడలింపులో భాగంగా ప్రభుత్వం అనుమతించినా..

Cinema Theaters : ప్రభుత్వం స్పందించకపోతే నిరాహరా దీక్షలే అంటోన్న తెలంగాణ థియేటర్ల ఓనర్లు
CInema Theatre
Follow us on

Cinema Theater owners : డిమాండ్లు పరిష్కరించకపోతే నిరాహార దీక్షకు దిగుతామంటున్నారు తెలంగాణ థియేటర్ల ఓనర్లు. లాక్‌డౌన్ తర్వాత సినిమాహాళ్లు మూతపడ్డాయి. ఆంక్షల సడలింపులో భాగంగా ప్రభుత్వం అనుమతించినా.. జనాలు రావడం లేదు. ఆర్థికంగా నష్టపోయిన తమను ఆదుకునేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని వాటిని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో థియేటర్లు మూతపడిన కాలానికి కరెంట్ చార్జీలపై మినహాయింపు, టికెట్‌ రేట్లు నిర్ణయించుకునే సౌలభ్యం, నాలుగు షోల కంటే ఎక్కువ షోలు వేసుకునేందుకు అవకాశం, పార్కింగ్ రుసుం వసూలు చేసుకునే అవకాశం కల్పించలనేవి థియేటర్ ఓనర్ల ప్రధాన డిమాండ్లు. తమ డిమాండ్లకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే నిరాహార దీక్షకు దిగుతామంటున్నారు సినిమాహాళ్ల ఓనర్లు.

Read also : Avanthi Srinivas : జీవీఎంసీ ఎన్నికల వేళ వైసీపీలో పెద్ద చర్చకే దారితీస్తోన్న మంత్రి అవంతి అలక, విజయసాయిరెడ్డి పనులపైనే కంటగింపు.!