TS government: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సినిమా థియేటర్లలో వందశాతం కెపాసిటీకి అనుమతి..

|

Feb 05, 2021 | 12:28 PM

Telangana Government: కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పరిశ్రమల్లో సినీ పరిశ్రమ కూడా ఒకటి. దాదాపు ఎనిమిది నెలలు పాటు అన్ని

TS government: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సినిమా థియేటర్లలో వందశాతం కెపాసిటీకి అనుమతి..
Follow us on

Telangana Government: కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పరిశ్రమల్లో సినీ పరిశ్రమ కూడా ఒకటి. దాదాపు ఎనిమిది నెలలు పాటు అన్ని షూటింగ్స్ నిలిచిపోయాయి. ఇటీవల మళ్లీ తిరిగి సినిమా చిత్రీకరణ మొదలైంది. కానీ నిర్మాతల భయం మాత్రం పోలేదు. దానికి కారణం థియేటర్‌లు అని చెప్పక తప్పదు. సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ కూడా యాభై శాతం ప్రేక్షకులతోనే నడిచాయి. అయితే ఇప్పట్లో 100 శాతం ఆక్యుపెన్సీ ఉండదని, దాని మీద ఆశలు వదులుకున్నట్లేనని అందరూ అనుకున్నారు.

కానీ అనూహ్యంగా తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సినిమా థియేటర్లలో 100 శాతం కెపాసిటీకి అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాక్సినేషన్‌కు తోడు వేసవిలో వాతావరణం కూడా కరోనా ప్రభావాన్ని తగ్గిస్తుందన్న అంచనాల నేపథ్యంలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులిచ్చిందని అంటున్నారు. కొద్ది సేపటి క్రితమే ఈ మేరకి కేంద్రం ప్రకటించింది. ఇకనుంచి సినిమా థియేటర్స్ 100 శాతం కెపాసిటీతో నడవనున్నాయి.

India vs England, 1st Test, Day 1 LIVE Score: రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్.. అధిపత్యం చలాయిస్తున్న టీమిండియా..