Tanikella Bharani : ఆయన మాలో ఉన్న అహాన్ని నాశనం చేశాడు.. తనికెళ్ల భరణి ఆసక్తికర కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా తనదైన ముద్ర వేశారు తనికెళ్ల భరణి. దశాబ్దాలుగా సినీరంగంలో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంలో ఎదురైన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. నేను అనే అహంకారం మనిషిని ఎలా పతనానికి గురి చేస్తుందో చెప్పడానికి ఒక ఉదాహారణ చెప్పుకొచ్చారు.

Tanikella Bharani : ఆయన మాలో ఉన్న అహాన్ని నాశనం చేశాడు.. తనికెళ్ల భరణి ఆసక్తికర కామెంట్స్..
Tanikella Bharani

Updated on: Nov 14, 2026 | 10:48 AM

తెలుగు సినీ జగత్తులో తనదైన ముద్ర వేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి తనికెళ్ళ భరణి. నటుడిగా, రచయితగా, కవిగా, దర్శకుడిగా, నాటక రచయితగా ఐదు వందలకు పైగా చిత్రాలలో పని చేసిన భరణి, తనను బహుముఖ ప్రజ్ఞాశాలి అని పిలవడంపై విలక్షణమైన అభిప్రాయాన్ని తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే రాక్షసుడని, తనకు ఒకే ముఖం ఉందని ఆయన హాస్యంగా అన్నారు. ఈ సంభాషణలో అహంకారం అనే అంశంపై భరణి లోతైన విశ్లేషణను అందించారు. అహంకారం అంటే కేవలం గర్వం మాత్రమే కాదని, అహం అంటే నేను అని, కారము అంటే దాని తీవ్రత అని అన్నారు. ఉదాహరణకు, ఒక పూజారికి నేను పూజారిని అనే అహంకారం, ఒక పోలీసు అధికారికి నేను పోలీసును అనే అహంకారం సహజంగా ఉంటుందని ఆయన వివరించారు. తాను రచయితను, నటుడిని, దర్శకుడిని అనే అహంకారాలు తనలో కూడా ఉంటాయని భరణి అన్నారు. అయితే, ఈ నేను అనే భావం అదుపు తప్పితే, అది మనిషిని ఎలా పతనానికి దారితీస్తుందో వివరించడానికి ఆయన ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందంతో తనకున్న ఆత్మీయ అనుబంధం గురించి చెబుతూ, ఇద్దరూ కలిసి ఒకసారి షూటింగ్ నిమిత్తం చిన్న పల్లెటూరుకు వెళ్లినట్లు తెలిపారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక సాధారణ శివాలయంలో జరిగిన సంఘటన వారి ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చివేసిందని ఆయన వెల్లడించారు. సాధారణంగా తాము ప్రముఖ నటులమని తెలిస్తే ఎవరైనా ప్రత్యేక గౌరవం ఇస్తారని ఆశించడం సహజమని, కానీ ఆ గుడిలోని పూజారి మాత్రం తాము వచ్చినప్పుడు పెద్దగా పట్టించుకోకుండా ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారని భరణి గుర్తుచేసుకున్నారు. మరుసటి రోజు ఉదయమే ఎంతో శ్రద్ధగా అభిషేకం పూర్తి చేసిన తర్వాత, తాము ఇచ్చిన దక్షిణను కూడా ఆ పూజారి తీసుకోలేదని తెలిపారు. పైగా తమకు కాఫీ లేదా టిఫిన్ ఇస్తామన్నా ఆయన సున్నితంగా తిరస్కరించారని చెప్పారు.

తనకు ఒక ఎకరం పొలం, ఒక ఆవు, పూజించడానికి శివుడు ఉన్నాడని, తనకు మరే ఇతర కోరికలు లేవని ఆ పూజారి చెప్పిన మాటలు తనను ఎంతగానో కదిలించాయని తనికెళ్ల భరణి భావోద్వేగానికి గురయ్యారు. ఎవరినీ ఏదీ ఆశించకుండా అంత ప్రశాంతంగా, తృప్తిగా బతకవచ్చనే నిజాన్ని ఆ ఘటన తమకు నేర్పిందని చెప్పారు. మాలో ఉన్న అహంకారం ఆ పూజారి నిరాడంబరతను చూసి కుప్పకూలిపోయిందని, ఆ స్ఫూర్తితోనే తాను ఆ తర్వాత ‘మా చెడ్డ మంచోడు దేవుడు’ అనే అద్భుతమైన పాటను రాసినట్లు ఆయన వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

Loading...
Unable to load recommendations.
Follow Us