Raja Raja Chora: ‘రాజా రాజా చోరా’ మూవీ ప్రీరీజ్ ఈవెంట్‌లో ఫన్నీ సీన్స్.. లైవ్

|

Aug 15, 2021 | 8:30 PM

'రాజా రాజా చోరా'. శ్రీవిష్ణు, మేఘా ఆకాష్, సునయనా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు

Raja Raja Chora: రాజా రాజా చోరా మూవీ ప్రీరీజ్ ఈవెంట్‌లో ఫన్నీ సీన్స్.. లైవ్
Raja Raja Chora
Follow us on

Raja Raja Chora Movie: ‘రాజా రాజా చోరా’. శ్రీవిష్ణు, మేఘా ఆకాష్, సునయనా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్రయూనిట్ ఈ వేడుకను ఏర్పాటు చేసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ ద్వారా ప్రేక్షకులను నవ్వించిన శ్రీవిష్ణు థియేటర్లలో మామూలుగా ఉండదంటూ చెబుతున్నారు.

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్న శ్రీవిష్ణు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పర్చుకున్నాడు. నేరుగా హీరోగానే కాకుండా.. పలు క్యారెక్టర్స్ చేస్తూ.. విలక్షణ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు శ్రీవిష్ణు. తాజాగా ఈ టాలెంటెడ్ హీరో ఇప్పుడు ‘రాజా రాజా చోర’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‏తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు.

హసిత్ గోలి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బిగ్‏బాస్ ఫేమ్ గంగవ్వ కూడా కీలక పాత్రలో నటించినట్లుగా టీజర్ ద్వారా హింట్ ఇచ్చారు మేకర్స్. నటుడు.. దర్శకుడు రవిబాబు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతోన్న మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ అనేక ఫన్నీ ఫన్నీ సీన్స్ కు వేదికగా మారింది.. ఆ లైవ్ చూద్దాం..

Read also: Chinna Jeeyar Swamy: 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో.. ధర్మాన్ని ధైర్యంగా చెప్పుకోలేని వాతావారణం ఉంది: చిన్నజీయర్ స్వామీజీ