
హాలీవుడ్ సినిమాలకు మన తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఎక్కడ చూసిన స్పైడర్ మ్యాన్ హవ కనిపిస్తుంది. ఇటీవలే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే డే సినిమా విడుదలైంది. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. హాలీవుడ్ తో పాటు మన దగ్గర కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది బ్రాండ్ న్యూ డే. రోజు రోజుకు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కలెక్షన్స్ పెరుగుతున్నాయి. టామ్ హలండ్ స్పైడర్ మ్యాన్ గా, జెండయా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సాడి సింక్, జాకబ్ బ్యాటలాన్ కీలక పాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే తాజాగా స్పైడర్ మ్యాన్ సినిమా ఆడుతున్న థియేటర్ లో పెద్ద గొడవ జరిగింది. థియేటర్ లో ఓ వ్యక్తిని అక్కడున్న ప్రేక్షకులు చితకబాదారు. ఎందుకో తెలిస్తే మీరు కూడా తప్పులేదు అంటారు. ఇంతకూ ఆ వ్యక్తి థియేటర్ లో ఏం చేశాడు.? ఆడియన్స్ కు ఎందుకు కోపం వచ్చింది.
అసలు మ్యాటర్ ఏంటంటే.. స్పైడర్ మ్యాన్ సినిమాలో ఉండే విజువల్స్, ట్విస్ట్ లు, అదిరిపోయే యాక్షన్ సీన్స్ కోసం ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు. ఆ ఎగ్జైమెంట్ ను చెడగొడితే ఊరుకుంటారా.? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ వ్యక్తి తన ప్రేయసిని తీసుకొని స్పైడర్ మ్యాన్ సినిమాకు వెళ్ళాడు.. హాలు ప్రేక్షకులతో నిండిపోయింది. సినిమా మంచి రసవత్తరంగా ఉండగా ఆ వ్యక్తి తన లవర్ తో మాట్లాడటం మొదలు పెట్టాడు. అంతటితో ఆగలేదు.. సినిమాలో నెక్ట్స్ వచ్చే సీన్స్ ను ముందుగానే చెప్పడం మొదలు పెట్టాడు.
చుట్టూ ఉన్న ఆడియన్స్ వీడెవడ్రా బాబు అని అనుకున్నా అతను ఆగలేదు. అదే పనిగా ఆమెకు సినిమా మొత్తం ముందే చెప్పుకుంటూ వస్తున్నాడు. దాంతో పక్కన ఉన్న ఫ్యాన్స్ కు కాలింది.. ఇంత డబ్బులు పెట్టుకొని తమ అభిమాన సూపర్ హీరో సినిమాకు వస్తే వీడు స్పాయిల్ చేస్తున్నాడని అందరూ కలిసి అతన్ని చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ పెడుతున్నారు. కొట్టడంలో తప్పే లేదు అని కొందరు అంటుంటే.. ఇలాంటి ఎదవలు మాకు కూడా తగిలారు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ప్రేయసితో వచ్చి తన్నులు తిన్నాడు సదరు వ్యక్తి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.