Shilpa Shetty: సోషల్‌ మీడియా ఖాతాలు డిలీట్‌ చేసిన రాజ్‌ కుంద్రా.. శిల్పాశెట్టి రియాక్షన్‌ ఏంటంటే..

|

Nov 03, 2021 | 7:27 AM

అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా సుమారు రెండు నెలలు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో బెయిల్‌పై విడుదలైన..

Shilpa Shetty: సోషల్‌ మీడియా ఖాతాలు డిలీట్‌ చేసిన రాజ్‌ కుంద్రా.. శిల్పాశెట్టి రియాక్షన్‌ ఏంటంటే..
Follow us on

అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా సుమారు రెండు నెలలు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో బెయిల్‌పై విడుదలైన ఆయన పెద్దగా బయట కనిపించడం లేదు. పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఇక జైలుకు వెళ్లే ముందు సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసు తర్వాత పూర్తిగా సైలెంట్‌ అయిపోయారు. జైలు నుంచి విడుదలైన తర్వాత సోషల్‌ మీడియాలో ఎలాంటి పోస్ట్‌లు పెట్టలేదు. తాజాగా ఆయన తన సోషల్‌ మీడియా ఖాతాలన్నీ డిలీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

అయితే ఇదే సమయంలో రాజ్‌కుంద్రా సతీమణి శిల్పాశెట్టి ఇన్‌స్టా స్టోరీస్‌లో ఒక పోస్ట్‌ పెట్టింది. Wilderness of Intuition అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ నోట్‌లో ఆమె అలన్‌ డాల్డా చెప్పిన కోట్‌ను కూడా గుర్తుచేసింది ‘ అప్పుడప్పుడు మనం సౌకర్యవంతమైన ప్రదేశాలను విడిచిపెట్టి కొత్త ప్రదేశాలకు వెళ్లాలి. అక్కడ మనకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. మనల్ని మనం కొత్తగా తెలుసుకునేందుకు ఈ మార్పు సహకరిస్తుంది. మన జీవితాల గురించి మనకు ఎన్నో అపోహలు, అనుమానాలు ఉండవచ్చు. అయితే మనం ఎవరో, మన ప్రయాణమేంటో మనకు మాత్రమే బాగా తెలుస్తుంది. కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు వచ్చి కొత్త ప్రదేశాల్లో గడిపినప్పుడు ఈ ప్రపంచం మనకు చాలా భిన్నంగా, కొత్తగా కనిపిస్తుంది. మనం ఊహించని అనుభూతులను ఇస్తుంది’ అని ఈ నోట్‌లో రాసి ఉంది.

Also Read:

Santosh Sobhan : కెరీర్ స్టార్టింగ్‌లోనే ఇలాంటి సినిమా చేయడం నా అదృష్టం: సంతోష్ శోభన్

Allu arjun family: అర్హ.. అయాన్‏తో కలిసి బన్నీ సతీమణి స్నేహ అల్లరి .. బ్రష్ చేతబట్టి పెయింటింగ్స్ వేస్తూ..(ఫొటోస్)

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ చివరి క్షణాలు.. ఈ సీసీ ఫుటేజ్ చూస్తే కన్నీళ్లు ఆగవు..