
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నటులతో కలిసి పనిచేసిన అరుదైన ఘనత సాధించిన సీనియర్ నటి సుధ, ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. అప్పట్లో అగ్ర హీరోల సరసన, అమ్మ పాత్రలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనం గురించి ఆమె చెప్పిన ఆసక్తికర విషయాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పెద్ద ఎన్టీఆర్ నటించిన ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా షూటింగ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చిన్న పిల్లాడిగా సెట్స్‌కు వచ్చి కూర్చునేవాడని సుధ గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తారక్ తన కళ్ళ ముందే పెరిగాడని, ఆయనను తాను ఎప్పుడూ తన సొంత కొడుకులాగే చూస్తానని ఆమె తెలిపారు. చిన్నతనంలో తారక్ చాలా అల్లరి చేసేవాడని, ఎవరినైనా ఇట్టే ఆటపట్టించేలా రాష్‌గా ఉండేవాడని ఆమె నవ్వుతూ చెప్పారు. ఆ రోజుల్లో కార్ వచ్చి ఆగిందంటే చాలు, పరుగున వచ్చి ఎవరి మీదో ఒకరి మీద పడి కొట్టేస్తాడేమో అనే భయం అందరిలోనూ ఉండేదని ఆమె సరదాగా పేర్కొన్నారు.
కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఎంతో ప్రశాంతంగా ఉంటాడని అన్నారు. ఇప్పుడు ఎవరితో ఎలా ఉండాలో.. కుటుంబ విలువలు పాటిస్తూ అందరితోనూ ఎంతో గౌరవంగా ప్రవర్తించే గొప్ప వ్యక్తిగా ఎదిగారని సుధ అన్నారు. కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లోనూ ఆయన ఎంతో డౌన్ టు ఎర్త్ ఉంటారని చెప్పడానికి ఒక ఉదాహరణను ఆమె పంచుకున్నారు. ‘బాద్షా’ సినిమా షూటింగ్ సమయంలో డ్యాన్స్ చేస్తుండగా తన కాలుకు గాయమై స్ప్రేయిన్ రావడంతో, పెద్ద హీరో అయిన తారక్ ఏమాత్రం సంకోచించకుండా స్వయంగా పరుగున వచ్చి తన కాలు పట్టుకుని స్ప్రే వేశారని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తోటి నటీనటులపై ఆయన చూపించే ఆదరాభిమానాలు, వినయమే నేడు ఆయనను పాన్ ఇండియా స్టార్ స్థాయికి చేర్చాయని సుధ చెప్పుకొచ్చారు.
అలాగే రామ్ చరణ్ చిన్నతనంలో ఎలా ఉండేవారనే విషయాలపై ఆమె ఆసక్తికరమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. చిరంజీవి నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ చాలా చిన్న పిల్లాడిగా సెట్స్‌కు వచ్చేవాడని సుధ తెలిపారు. ఆ రోజుల్లో చిన్నపిల్లాడిగా ఉన్న చరణ్‌ను తాను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నానని, అప్పట్లో ఎంతో అల్లరిగా తిరిగిన ఆ పిల్లాడు నేడు టాలీవుడ్లో గ్లోబల్ స్టార్‌గా ఎదగడం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..
Sudha, Jrntr
ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..