RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అడుగుపెట్టనున్న లేడీ స్కాట్‌

| Edited By:

Nov 01, 2020 | 11:53 AM

రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టార్‌ 'ఆర్‌ఆర్‌ఆర్'‌. లాక్‌డౌన్ సడలింపుల తరువాత ఇటీవలే

RRR: ఆర్‌ఆర్‌ఆర్‌లో అడుగుపెట్టనున్న లేడీ స్కాట్‌
Follow us on

RRR movie updates: రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టార్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్’‌. లాక్‌డౌన్ సడలింపుల తరువాత ఇటీవలే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా పలు జాగ్రత్తలతో రాజమౌళి ఈ మూవీ షూటింగ్‌ని జరిపిస్తున్నారు. ఇక ఈ మూవీలో పలువురు హాలీవుడ్‌ నటులు కూడా భాగమైన విషయం తెలిసిందే. ( పవన్‌ మూవీ కోసం నితిన్‌ కీలక నిర్ణయం..!)

ఇప్పుడు వారందరూ షూటింగ్‌ కోసం హైదరాబాద్ వస్తున్నారు. తాజాగా ఐరీష్‌ నటి ఎలిసన్ డూడీ భారత్‌కి వస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. లేడీ స్కాట్‌ భారత్‌కి వస్తున్నారు అని ఎలిసన్‌ పోస్ట్ పెట్టారు. అందుకు స్పందిస్తున్న పలువురు టాలీవుడ్‌ నెటిజన్లు వెల్‌కమ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ( బిచ్చగత్తె కాదు మిలియనీర్‌: బయటపడ్డ దొంగవేషం.. యాచకురాలు అరెస్ట్‌)

కాగా రియల్ కారెక్టర్స్‌తో కూడిన ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌తో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. అలియా భట్‌, ఒలివియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. (ప్రభాస్ ‘ఆదిపురుష్’‌.. సీతగా ఆ ఇద్దరిలో ఒకరు..!)