‘భారతీయుడు 2’.. దర్శకుడు, నిర్మాత మధ్య గొడవ.. ఆ హీరో విషయంలోనేనా..!

| Edited By:

Apr 25, 2020 | 10:15 AM

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం ఇండియన్ 2. ఈ సీక్వెల్‌ను ఏ ముహూర్తాన అనౌన్స్ చేశారో తెలీదు గానీ అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌కు ఆటంకాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొదట ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత లైకా ప్రొడక్షన్స్ లైన్‌లోకి వచ్చి.. మూవీని ప్రొడ్యూస్‌ చేసేందుకు ఒప్పుకుంది. (అయితే అప్పటికే శంకర్‌ వలన […]

భారతీయుడు 2.. దర్శకుడు, నిర్మాత మధ్య గొడవ.. ఆ హీరో విషయంలోనేనా..!
Follow us on

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం ఇండియన్ 2. ఈ సీక్వెల్‌ను ఏ ముహూర్తాన అనౌన్స్ చేశారో తెలీదు గానీ అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌కు ఆటంకాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొదట ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత లైకా ప్రొడక్షన్స్ లైన్‌లోకి వచ్చి.. మూవీని ప్రొడ్యూస్‌ చేసేందుకు ఒప్పుకుంది. (అయితే అప్పటికే శంకర్‌ వలన చాలనే నష్టపోయిన లైకా.. భారతీయుడు 2 విషయంలో ఈ దర్శకుడికి చాలా కండీషన్లే పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అది వేరే విషయం). ఇక సెట్స్ మీదకు వెళ్లిన తరువాత కూడా ఈ మూవీకి చాలా ఆటంకాలు వచ్చి.. పలుమార్లు షూటింగ్‌ కూడా ఆగిపోయింది.

అదంతా ఒక ఎత్తు అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో భారతీయుడు 2 షూటింగ్‌లో జరిగిన ప్రమాదం మూవీ యూనిట్‌కు పెద్ద ఇబ్బందిని కలిగించింది. ఆ ప్రమాదంపై పోలీసులు కేసు కూడా నమోదు చేయగా.. దాని విచారణ ఇంకా జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ విషయంలో దర్శకుడు, నిర్మాతకు మధ్య మళ్లీ ఇబ్బందులు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్‌ 2లో బాబీ సింహా కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో కమల్ పాత్ర కంటే.. బాబీ సింహా కారెక్టర్‌నే ఎక్కువగా ఉందట. కమల్‌ను మించేలా బాబీ పాత్రను శంకర్ డిజైన్ చేశారట. ఈ విషయంలో కమల్, నిర్మాత మధ్య బేదాభిప్రాయాలు తలెత్తినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాబీ పాత్ర విషయంలో కాస్త ఆలోచించమని నిర్మాత, శంకర్‌కు చెప్పినట్లు టాక్‌. మరి ఇందులో నిజమెంత..? ఇండియన్ 2 విషయంలో అసలు ఏం జరుగుతోంది..? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Read This Story Also: కిమ్‌ కోసం చైనా నుంచి ప్రత్యేక టీమ్.. అసలు ఏం జరుగుతోంది..!