నువ్వా Vs నేనా.. తండ్రితో పోటీకి సై అంటున్న యంగ్ హీరో !!

మలయాళ మెగాస్టార్ ముమ్ముట్టి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళంతో పాటు ఇతర భాషల్లో సైతం నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. కాగా తండ్రి బాట లోనే సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ సైతం తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించి స్టార్ హీరోగా ఎదిగారు. అయితే ఇన్నాళ్లు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు ఆయన నటించిన మూవీతోనే బాక్సాఫీస్ ఫైట్‌కు రెడీ అంటున్నారు.

నువ్వా Vs నేనా.. తండ్రితో పోటీకి సై అంటున్న యంగ్ హీరో !!
Movie Release Clash

Edited By:

Updated on: Nov 16, 2026 | 5:48 PM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలితో ఇండియన్ సినిమా రేంజ్ మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే బాహుబలికి ముందు.. బాహుబలి తర్వాత అన్నట్టు మారిపోయింది. కానీ నాటి నుంచి నేటికీ కూడా బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నడుస్తూనే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే క్లాష్ జరగబోతుంది. సాధారణంగా తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఓ స్టార్ హీరో తన తండ్రి మూవీతో కలెక్షన్స్ సమరానికి సై అంటున్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. సొంత భాషలో కాకుండా.. వారిద్దరూ వేర్వేరు భాషల చిత్రాలతో ఒకే రోజు తమ చిత్రాలను రిలీజ్ చేస్తుండడం. దీంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మెగాస్టార్ మూవీకి పోటీగా దుల్కర్..

మెగాస్టార్ ముమ్ముట్టి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళంతో పాటు ఇతర భాషల్లో సైతం నటించి దక్షిణాదినే కాకుండా దేశ, విదేశాల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. మమ్ముక్క నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అనడానికి.. ఆయనకి వచ్చిన జాతీయ అవార్డులే నిదర్శనం అనొచ్చు. కాగా తండ్రి బాట లోనే సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ సైతం తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించి స్టార్ హీరోగా ఎదిగారు. తెలుగులో కూడా మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో ఆడియన్స్ ని అలరించారు. అయితే ఇన్నాళ్లు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు నాన్న నటించిన మూవీతోనే బాక్సాఫీస్ ఫైట్‌కు రెడీ అంటున్నారు.

ఏ ఏ చిత్రాలంటే..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా.. అమరన్ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియస్వామి తెరకెక్కిస్తున్న మూవీ ‘ఓం’ (O.M). పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. అలానే సాయి పల్లవి, శ్రీలల కూడా ముఖ్య పాత్రలలో కనిపించనుండడంతో.. తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సమకూర్చిన సంగీతం హైలైట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ సైతం మంచి ఆదరణ పొందుతున్నాయి.

మరోవైపు దుల్కర్ సల్మాన్ విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా మారిపోయారు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత “ఆకాశంలో ఒక తార” అనే చిత్రంతో మళ్లీ రాబోతున్నారు. పవన్ సాధినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని.. వైజయంతి మూవీస్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే ఈ రెండు చిత్రాలు నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

అయితే భాష రీత్యా గమనిస్తే.. మలయాళ హీరోలైన ఈ తండ్రీకొడుకులు ఇప్పుడు తమ భాషలో కాకుండా వేరు వేరు భాషల్లో పోటీ పడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. తెలుగులో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న దుల్కర్ మళ్లీ సత్తా చాటుతారా.. లేదా చాలా గ్యాప్ తర్వాత తమిళ మూవీ చేస్తున్న మమ్ముట్టి సక్సెస్ అందుకుంటారా అని ఫిల్మ్ ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతోంది. మరి నవంబర్ 20న జరగబోయే బాక్సాఫీస్ పోటీలో ఎవరు హిట్ కొడతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే..

Loading...
Unable to load recommendations.
Follow Us