షూటింగ్ స్పాట్‌ ఫన్నీ వీడియోను షేర్ చేసిన రష్మిక.. వివాదాన్ని ముందుగానే ఊహించి క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ.

| Edited By: Anil kumar poka

Dec 18, 2020 | 6:01 PM

నిత్యం సినిమాలతో బిజీగా ఉండే రష్మిక మందన్న సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమా, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకునే రష్మిక.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఫన్నీ వీడియోను పోస్ట్ చేసింది.

షూటింగ్ స్పాట్‌ ఫన్నీ వీడియోను షేర్ చేసిన రష్మిక.. వివాదాన్ని ముందుగానే ఊహించి క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ.
Follow us on

Rashmika shares funny video: ‘కిర్రిక్ పార్టీ’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది అందాల తార రష్మిక మందన్న. కన్నడ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ఛలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తన క్యూట్ లుక్స్, నటనతో తెలుగు కుర్రకారు మతి పోగొట్టిన ఈ అందాల తార ‘గీత గోవిందం’ సినిమాతో ఒక్కసారిగా బడా హీరోయిన్‌గా మారింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో రష్మికకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం బడా హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంటూ దూసుకెళుతోందీ చిన్నది.
ఇదిలా ఉంటే నిత్యం సినిమాలతో బిజీగా ఉండే ఈ అందాల తార సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమా, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకునే రష్మిక.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఫన్నీ వీడియోను పోస్ట్ చేసింది.

‘ఛలో’ చిత్రానికి సంబంధించిన ఓ వర్కింగ్ వీడియోను పోస్ట్ చేసిన రష్మిక.. ‘ఈ వీడియో ఎవరికైనా గుర్తుందా’? అని క్యాప్షన్ జోడించింది. ఈ వీడియోలో రష్మిక దేవత గెటప్‌లో తుంబురను తిప్పుతూ ఉంది. అయితే ఎక్కడ వీడియో కాంట్రవర్సీలకు దారి తీస్తుందో అని భావించిన ఈ ముద్దుగుమ్మ మరో క్యాప్షన్‌ను కూడా రాసుకొచ్చింది. ఇంతకీ ఆ క్యాప్షన్ ఏంటంటే.. ‘నేను ఏ సాంప్రదాయాన్నీ, దేవతలను అగౌరవపరచడం లేదు. ఈ వీడియోను దయచేసి ఆ కోణంలో చూడకండి. ఇది ఓ సినిమాలోని ఫన్నీ సీన్` అని పేర్కొంది. ఇలా రష్మిక ముందుగానే జాగ్రత్త పడిందన్నమాట.