Acharya Movie : ‘ఆచార్య’కోసం అడవులకు చిరు-చరణ్.. మారేడుమిల్లిలో మెగా హీరోల సందడి..

|

Feb 04, 2021 | 9:29 PM

మెగాస్టార్వ్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Acharya Movie : ఆచార్యకోసం అడవులకు చిరు-చరణ్.. మారేడుమిల్లిలో మెగా హీరోల సందడి..
Follow us on

Acharya Movie :మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మెగాస్టార్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నరు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి,రామ్ చరణ్ నక్సలైట్లుగా కనిపించనున్నారని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం చిరంజీవి, రామ్ చరణ్ మారేడుమిల్లి అడ‌వులకు వెళ్లనున్నారు. చిరంజీవి, చరణ్ ల కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలను ఇక్కడ షూట్ చేయనున్నారు. ఇక ఇదే అడవుల్లో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న’పుష్ప’ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇలా మెగా హీరోలు షూటింగ్స్ లో మారేడుమిల్లి అడవుల్లో హల్చల్ చేయనున్నారు. ఇక ఆచార్య సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. సోనూసూద్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.

 మరిన్ని ఇక్కడ చూడండి : 

అక్కచెల్లెమ్మల కోసం బరిలోకి దిగిన ‘రాఖీ’.. ఆన్ లైన్ మోసలపట్ల అవగాహన కల్పిస్తున్న తారక్..

Kajol Tribhanga Trailer: ఆకట్టుకుంటోన్న కాజోల్‌ ‘త్రిభంగా’ ట్రైలర్‌.. మూడు తరాల మహిళల మధ్య జరిగే..