Rakul Preet Singh: రకుల్‌ కరోనాను ఎలా జయించిందో తెలుసుకోవాలనుందా..? అయితే ఈ వీడియో చూడండి..

కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం అంతా ఇంత కాదు. ఎంతో మంది ఈ వైరస్‌ బారిన పడి ప్రాణాలు సైతం విడిచారు. ఇప్పుడైతే వ్యాక్సిన్‌ వచ్చింది కానీ తొలి నాళ్లలో మాత్రం ప్రజలు చాలా ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే..

Rakul Preet Singh: రకుల్‌ కరోనాను ఎలా జయించిందో తెలుసుకోవాలనుందా..? అయితే ఈ వీడియో చూడండి..
ఇవి కాకుండా ఎటాక్‌, సర్దార్ అండ్ గ్రాండ్‌సన్‌ అనే రెండు సినిమాలున్నాయి రకుల్ కిట్టీలో. 

Updated on: Jan 24, 2021 | 5:58 PM

Rakul Shares Her Covid Recovery Journey: కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం అంతా ఇంత కాదు. ఎంతో మంది ఈ వైరస్‌ బారిన పడి ప్రాణాలు సైతం విడిచారు. ఇప్పుడైతే వ్యాక్సిన్‌ వచ్చింది కానీ వైరస్ వెలుగులోకి వచ్చిన తొలి నాళ్లలో మాత్రం ప్రజలు చాలా ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే కరోనా బారిన పడిన వారు తమ అనుభవాలను ఇతరులతో పంచుకున్నారు.

ఇదిలా ఉంటే టాలీవుడ్‌ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా కరోనా బారినపడి ఇటీవలే కోలుకున్న విషయం తెలిసిందే. అయితే కరోనాను జయించే క్రమంలో రకుల్‌ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. తాను కరోనాను ఎలా జయించిందన్న వివరాలను అభిమానులతో పంచుకుందీ బ్యూటీ. ఇందులో భాగంగా రూపొందించిన ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేయడానికి వీడియో లింక్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన రకుల్‌.. ‘నేను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన కొత్త వీడియోను చూడండి. కొవిడ్‌తో బాధపడుతోన్న వారికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ క్యాప్షన్‌ జోడిచిందీ బ్యూటీ. ఇక ఈ వీడియోలో రకుల్‌ తాను కరోనాను ఎలా ఎదుర్కొంది, ఎలాంటి ఆహారం తీసుకుంది, ఎలాంటి వర్కవుట్లు చేసింది లాంటి విషయాలన్నింటినీ ఎంతో వివరంగా తెలియజేసింది.

Alsi Read: Bernie Sanders Meme: వైరల్‌గా మారుతోన్న ‘బెర్నీ సాండర్స్‌ మీమ్‌ ఫెస్ట్‌’… అసలు ఈ మీమ్‌ వెనక ఉన్న కథేంటో తెలుసా.?