Rakul Preet Singh: మరో కొత్త వ్యాపారంలోకి రకుల్.. ఈసారి సినిమాల్లో నటించే వారి కోసం..

| Edited By: Anil kumar poka

Jan 23, 2022 | 9:26 AM

రకుల్ ప్రీత్ సింగ్..  సినిమా ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకు వరుస సినిమాలతో దూసుకెళ్తోందీ పంజాబీ ముద్దుగుమ్మ

Rakul Preet Singh: మరో కొత్త వ్యాపారంలోకి రకుల్.. ఈసారి సినిమాల్లో నటించే వారి కోసం..
Rakul Preet Singh
Follow us on

రకుల్ ప్రీత్ సింగ్..  సినిమా ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకు వరుస సినిమాలతో దూసుకెళ్తోందీ పంజాబీ ముద్దుగుమ్మ.  ప్రస్తుతం సినిమా షూటింగులతో బిజీగా ఉంటోన్న ఈ అందాల తార  బిజినెస్‌ విమన్‌గానూ రాణిస్తోంది.  ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఫిట్ నెస్ అండ్ వెల్ నెస్ సెంటర్లు నిర్వహిస్తోంది. కాగా  తనలాగే సినిమా ఇండస్ట్రీలోకి రావాలని కలలు కనేవారి కోసం ఓ వేదికను కల్పించేందుకు రెడీ అయింది రకుల్.  ఇందులో భాగంగానే తన సోదరుడితో కలిసి ‘స్టారింగ్‌యూ’ అనే స్టార్టప్‌/ వెబ్ సైట్ ని ప్రారంభించింది.

తమ్ముడితో కలిసి..

రకుల్‌ తన సోదరుడు అమన్‌ ప్రీత్‌సింగ్‌తో కలిసి ఈ స్టార్టప్‌ని ప్రారంభించింది. సినిమాల్లోకి రావాలి అనుకునే వారికి ఇదో డిజిటల్‌ వేదికగా పని చేయనుంది.  సినిమా ఇండస్ట్రీకి సంబంధించి 24 క్రాఫ్ట్‌లలో అనుభవం ఉన్న వారు ఈ యాప్‌ ద్వారా తమ  కలలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నించవచ్చు.   తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమకు చెందిన ప్రముఖ స్టూడియోలు, నిర్మాణ సంస్థలతో `స్టారింగ్‌యూ` ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన వారి ప్రతిభని గుర్తించి ఎవరు దేనికి  సూట్ అవుతారో  అనే విషయాన్ని కూడా స్పష్టంగా ఈ వెబ్ సైట్ లో వెల్లడించనున్నారట. దీంతో సినిమా మేకర్స్ కి కూడా తమ పాత్రలకు సూటయ్యే నటీనటుల అన్వేషణ కూడా సులభం కానుంది.

అచ్చం వాటిలాగే..

ఉద్యోగాన్వేషణలో ఉండే వారి కోసం ప్రత్యేకంగా నౌకరీ.కామ్‌, మాన్‌స్టర్‌.కామ్‌, లింక్డ్ ఇన్  వంటి పోర్టల్స్‌, యాప్స్‌ వచ్చాయి.  ఇందులో మన రెజ్యూమ్‌ అప్‌లోడ్‌ చేస్తే చాలు.. కంపెనీల నుంచి ఆహ్వానాలు అందుతాయి. అటు నిరుద్యోగులకు, అటూ కంపెనీలకు ఈ వెబ్‌సైట్లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.  ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రకుల్ ప్రారంభించిన ‘స్టారింగ్‌యూ’ కూడా ఇదే తరహాలో పని చేయనుంది.  కాగా సినిమాల్లో లాగే వ్యాపారంలోనూ రకుల్‌  విజయవంతం కావాలని ఆమె అ భిమానులు కోరుకుంటున్నారు.

Also Read: Coronavirus: తిరుపతి ఐఐటీ క్యాంపస్ లో కరోనా కలకలం.. భారీగా వెలుగు చూసిన పాజిటివ్ కేసులు..

Longest Names: ఆ పెంపుడు కుక్క పేరు చాంతాడంత.. అందుకే గిన్నిస్ ఎక్కింది. అదొక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి..

Pregnency Care: గర్భిణీలు నవ్వడం మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారు..