RRR Movie: ‘ఆర్ఆర్ఆర్‌’కు కాపీ మరక..!

| Edited By: Pardhasaradhi Peri

Apr 02, 2020 | 10:00 PM

సినిమాలను తెరకెక్కించడంలో రాజమౌళి ప్రతిభను ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ప్రతి ఫ్రేమ్‌ను ఆయన అద్భుతంగా తీర్చిదిద్దుతారు కాబట్టే.. జక్కన్నగా బిరుదునొందారు.

RRR Movie: ఆర్ఆర్ఆర్‌కు కాపీ మరక..!
Follow us on

సినిమాలను తెరకెక్కించడంలో రాజమౌళి ప్రతిభను ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ప్రతి ఫ్రేమ్‌ను ఆయన అద్భుతంగా తీర్చిదిద్దుతారు కాబట్టే.. జక్కన్నగా బిరుదునొందారు. అయితే ఎంత అద్భుతంగా సినిమాలను తెరకెక్కించినప్పటికీ.. ఆయన చిత్రాలకు కాపీ మరకలు అంటుకుంటూనే ఉన్నాయి. సింహాద్రి నుంచి మొదలు బాహుబలి సిరీస్‌ల వరకు ఆయన తెరకెక్కించిన చిత్రాల్లోని పలు సీన్లను వేరే సినిమాల నుంచి కాపీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ పక్కనపెడితే ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్‌కు అప్పుడే కాపీ మరకలు అంటుకున్నాయి.

ఈ సినిమా నుంచి టైటిల్‌, మోషన్ పోస్టర్‌ను ఉగాది రోజున విడుదల చేయగా.. అందులో చెర్రీని నిప్పుతో, ఎన్టీఆర్‌ను నీళ్లతో పోల్చారు రాజమౌళి. ఇక ఈ కాన్సెప్ట్‌ 1983లో వచ్చిన ఫైర్ అండ్ ఐస్‌ అనే హాలీవుడ్ చిత్రం నుంచి రాజమౌళి కాపీ చేశారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఫిక్షన్ కథాంశంతో రాజమౌళి ఆర్ఆర్ఆర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించబోతున్నారు. అజయ్ దేవగన్, అలియా భట్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తుండగా., వచ్చే ఏడాదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Read This Story Also: తొందరపడుతోన్న చందమామ.. వినకుండానే..!