solo brathuke so better : ‘సోలోబ్రతుకే సో బెటర్’ సినిమా ఆదరణకు కారణం ప్రేక్షకుడు థియేటర్ కు రావడమే..

|

Dec 29, 2020 | 8:59 PM

కరోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీ స్పష్టంగా కనిపించింది. పనులు లేక సినీకార్ముఖులు చాలా ఇబ్బంది పట్టారు. కరోనా సమయంలో ఇండస్ట్రీనే కాదు ప్రేక్షకులు కూడా చాలా..

solo brathuke so better : సోలోబ్రతుకే సో బెటర్ సినిమా ఆదరణకు కారణం ప్రేక్షకుడు థియేటర్ కు రావడమే..
Follow us on

కరోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీ స్పష్టంగా కనిపించింది. పనులు లేక సినీకార్ముఖులు చాలా ఇబ్బంది పట్టారు. కరోనా సమయంలో ఇండస్ట్రీనే కాదు ప్రేక్షకులు కూడా చాలా ఇబ్బంది పడ్డారని నటుడు ఆర్ నారాయణ మూర్తి అన్నారు. సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సోబెటర్ సినిమా సక్సెస్ మీట్ కు హాజరైన ఆయన మాట్లాడుతూ.. సినిమా చూడటానికి అసలు థియేటర్స్ కి రావాలా వద్దా అని ప్రేక్షకులు ఆలోచిస్తున్న సమయం ఇది. కరోనా ప్రభావంతో  ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలమంది కార్మికులు ఇబ్బందులు పడ్డారు. సినీ ఇండస్ట్రీ కోసం కేసీఆర్‌గారు, జగన్‌గారు ఎన్నో రాయితీలు ప్రకటించారు అన్నారు. సోలో బ్రతుకే సోబెటర్ సినిమా దైర్యం చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆదరణ  పొందింది. ఈ ఆదరణకు ప్రేక్షకుడు థియేటర్స్ కు రావడమే అని నారాయణ మూర్తి అన్నారు. ప్రేక్షకుడు కూడా కరోనా ప్రభావం వల్ల ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి సమయంలో కోర్టులకు వెళ్లి టెక్కెట్‌ రేట్స్‌ పెంచుకోకండి. ఎంత బడ్జెట్‌ మూవీ అయినా టికెట్‌ రేటు పెంచవద్దని ఇండస్ట్రీని కోరుకుంటున్నాను అని నారాయణ మూర్తి అన్నారు. కోర్టులకు వెళ్లి టికెట్స్‌ రేట్స్‌ పెంచడం కరెక్ట్‌ కాదు. అలా చేస్తే అది బ్లాక్ మార్కెటింగ్‌ కాదు.. అథరైజ్డ్‌ బ్లాక్‌ మార్కెటింగ్‌ అవుతుంది. ఇలా రేట్లు పెంచేస్తే సామాన్య ప్రేక్షకుడు సినిమాను ఏం చూస్తాడు అని నారాయణ మూర్తి ప్రశ్నించారు.  సీఎం కేసీఆర్‌గారు, వైఎస్‌ జగన్‌గారు.. టికెట్‌ రేట్స్‌ పెంచడానికి ఒప్పుకోవద్దని కోరుతున్నాను అని నారాయణ మూర్తి అన్నారు.

Also Read :

vakeel saab : పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ .. ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తిచేసిన పవన్ కళ్యాణ్