Tollywood : రూ. 100 కోట్లతో భారీ ఇల్లు కట్టిన స్టార్ కమెడియన్.. ఆ ఇంటి వెనుక ఉన్న సెంటిమెంట్ ఇదే..

చిత్ర పరిశ్రమలో తనదైన బాడీ లాంగ్వేజ్, ప్రత్యేకమైన మాడ్యులేషన్ , అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో కోట్లాది మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన లెజెండరీ కమెడియన్ వడివేలు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కేవలం కమెడియన్‌గానే కాకుండా 'ఇమ్సై అరసన్ 23వ పులికేసి ' వంటి చారిత్రాత్మక చిత్రాలలో హీరోగా నటించి తన నటనలోని వైవిధ్యాన్ని చాటుకున్నారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది.

Tollywood : రూ. 100 కోట్లతో భారీ ఇల్లు కట్టిన స్టార్ కమెడియన్.. ఆ ఇంటి వెనుక ఉన్న సెంటిమెంట్ ఇదే..
Vadivelu

Updated on: Oct 24, 2026 | 8:09 PM

తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, మాటతీరుతో కోట్లాది మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన లెజెండరీ కమెడియన్ వడివేలు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దశాబ్దాల పాటు కోలీవుడ్‌లో నంబర్ వన్ కమెడియన్‌గా వెలుగొందిన ఆయన, తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలతో నవ్వుల రారాజుగా నిలిచారు. అయితే తాజాగా వడివేలు తన సొంతూరిలో నిర్మించిన ఒక భారీ భవంతికి సంబంధించిన విషయాలు, అందుకోసం ఆయన వెచ్చించిన మొత్తం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సుమారు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆయన ఈ గృహాన్ని నిర్మించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ యూట్యూబర్ తన వీడియో ద్వారా బయటపెట్టారు. కోట్లాది రూపాయలు సంపాదించిన ఎంతోమంది సెలబ్రిటీలు చెన్నై లేదా ఇతర మహానగరాలలో విలాసవంతమైన విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేస్తుంటారు. కానీ వడివేలు మాత్రం తన విజయాలకు మూలమైన తన స్వస్థలంలోనే అందరూ కలిసి ఉండేలా ఈ భారీ ఇంటిని నిర్మించారు. మధురై సమీపంలోని తన స్వగ్రామంలో సుమారు 200 మంది కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ ఒకే గొడుగు కింద నివసించేలా ఈ భారీ నిర్మాణం చేపట్టారు. తన కష్టకాలంలోనూ, విజయాల్లోనూ తన వెన్నంటే ఉన్న కుటుంబ సభ్యులను ఎప్పుడూ ఒకే చోట చూడాలన్నదే ఆయన కోరికగా ఉండేదని సన్నిహితులు చెబుతున్నారు.

ఈ భారీ భవనంలో అత్యాధునిక హంగులతో పాటు కుటుంబ సభ్యులందరికీ సరిపడే సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. దీని విలువ దాదాపు రూ. 100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సాధారణ నేపథ్యం నుంచి వచ్చి, పరిశ్రమలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగిన వడివేలు, తన కుటుంబంపై ఉన్న ప్రేమను ఈ రూపంలో చాటుకోవడం పట్ల అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ లగ్జరీ హౌస్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : ముఠా మేస్త్రీ షూటింగ్ 3 నెలలు ఆగిపోయింది.. అప్పుడు చిరంజీవి చెప్పిన మాటకు ఆశ్చర్యపోయా.. బాబూ మోహన్..

కోలీవుడ్‌లో కేవలం ఒక కమెడియన్‌గానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక శైలిని సృష్టించుకుని ‘వైగై పుయల్’గా పేరుగాంచారు. ఆయన హావభావాలు, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తమిళంలోని అగ్ర హీరోలందరి సినిమాలలోనూ వడివేలు ప్రధాన హాస్యనటుడిగా నటించారు. ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, విక్రమ్ వంటి స్టార్ హీరోల సినిమాలలో ఆయన కామెడీ ట్రాక్‌లు సినిమాకే హైలైట్‌గా నిలిచేవి.

ఎక్కువ మంది చదివినవి : Idupu Kayitham: ఇడుపు కాయితం నుంచి గడప సాంగ్ రిలీజ్.. ప్రతి అమ్మాయి హృదయాలను హత్తుకునే పాట..

వడివేలు హోమ్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : గరివిడి లక్ష్మి పాత్రను మిస్ చేసుకున్న మరో హీరోయిన్.. నిత్యా మీనన్‏తోపాటు ఆ క్రేజీ బ్యూటీ కూడా..

Loading...
Unable to load recommendations.
Follow Us