ప్రభాస్ ‘రాధే శ్యామ్’‌.. పూజా రోల్‌పై ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌

| Edited By:

Sep 28, 2020 | 5:11 PM

జిల్ ఫేమ్‌ రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న చిత్రం రాధే శ్యామ్‌. పీరియాడిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది.

ప్రభాస్ రాధే శ్యామ్‌.. పూజా రోల్‌పై ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌
Follow us on

Prabhas Radhe Shyam: జిల్ ఫేమ్‌ రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న చిత్రం రాధే శ్యామ్‌. పీరియాడిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌కి బ్రేక్ రాగా.. త్వరలో ఇటలీలో చిత్రీకరణను తిరిగి ప్రారంభించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది.

ఇక ఈ సినిమాలో పూజ హెగ్డేకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది. అదేంటంటే ఈ మూవీలో పూజా డ్యూయల్ రోల్‌లో కనిపించనుందట. అది ఏఏ పాత్ర అని తెలియనప్పటికీ.. సినిమాకు ఆ రెండు పాత్రలు కీలకం అని సమాచారం. కాగా యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.

Read More:

ఒక్క రూపాయికే బైక్‌ బుక్ చేసుకునే అవకాశం.. వివరాలివే

బన్నీకి విలన్‌గా కోలీవుడ్ స్టైలిష్‌ హీరో..!