ఆయనకు ఎన్నో లేఖలు రాశా.. ఓ మంచి రోజు బయటపెడతా..!

| Edited By:

Apr 03, 2020 | 7:22 PM

వరుస సక్సెస్‌లతో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం ఆమెకు ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో మంచి అవకాశాలు ఉన్నాయి.

ఆయనకు ఎన్నో లేఖలు రాశా.. ఓ మంచి రోజు బయటపెడతా..!
Follow us on

వరుస సక్సెస్‌లతో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం ఆమెకు ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో.. ఇంట్లో ఎంజాయ్‌ చేస్తోంది పూజా. ఈ నేపథ్యంలో ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో కాసేపు ముచ్చటించింది ఈ భామ. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన ఆమె పలు విషయాలను వారితో పంచుకుంది.

ఈ క్రమంలో మీ జీవితంలో జరిగిన ఓ యూనిక్‌ సంఘటన గురించి చెప్పమని అడగ్గా.. చిన్నవయసులో శాంటా నిజంగా ఉంటాడని నేను చాలా నమ్మేదాన్ని. ఆయన గురించి నేను చాలా కథలను విన్నా. దీంతో ఆయనకు చాలా లేఖలు కూడా రాశా. ఓ మంచి రోజు వాటిని మీతో షేర్ చేసుకుంటా అని పూజా పేర్కొన్నారు. ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో తాను తినడం, నిద్రపోవడం, టీవీ చూడటం చేస్తున్నానని తెలిపారు. అలాగే పలువురు సెలబ్రిటీల గురించి తన మనసులోని మాటను ఆమె బయటపెట్టారు.

ఏ స్టార్ గురించి పూజా ఏం చెప్పిందంటే..!

ప్రభాస్ః జోవియల్ స్టార్
నానిః తెలివైన నటుడ
షారూక్‌ ఖాన్ః కింగ్ ఆఫ్‌ రొమాన్స్‌
హృతిక్ రోషన్ః తెగ ఇష్టం. బయటే కాదు వ్యక్తిగతంగా చాలా అద్భుతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు.
రజనీకాంత్ః లెజండ్
ఫేవరెట్ సింగర్ః ఏఆర్ రెహమాన్, ఆయన మరో లెజండ్
తెలుగు ప్రేక్షకులుః నా జీవితం
ఇష్టమైన సబ్జెక్ట్‌లుః ఫిజిక్స్‌, ఇంగ్లీష్, టెక్నికల్ డ్రాయింగ్
నటి అవ్వకపోయి ఉంటేః స్టైలిష్‌ ఫొటోగ్రాఫర్ అయ్యేదాన్ని
ఫేవరెట్ పాటః మనసా మనసా(మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచులర్‌)

Read This Story Also: చెర్రీ ఫేవరెట్ హీరోయిన్‌ ఎవరో తెలుసా..!