ఈ సినిమా ఉంటది భయ్యా..! సీన్ సీన్‌కు సితారే.. గుండె దైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన మూవీ

ప్రస్తుతం ఓటీటీలో క్రైమ్, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషతో సంబంధం లేకుండా మరీ ఈ జానర్ చిత్రాలను చూస్తున్నారు ఆడియెన్స్. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు ప్రతి వారం ఈ రకమైన సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి .

ఈ సినిమా ఉంటది భయ్యా..! సీన్ సీన్‌కు సితారే.. గుండె దైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన మూవీ
Ott Movie

Updated on: May 24, 2026 | 7:01 AM

కొన్ని సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకుట్టుకుంటాయి. ఈ మధ్యకాలంగా వస్తున్న సినిమాలు ఒక్కసారి చూస్తే మళ్లీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టావు.. కేవలం రొమాంటిక్, లవ్ స్టోరిలే కాదు.. హారర్. థ్రిల్లర్ సినిమాలకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా హారర్ సినిమాలు.. దెయ్యాల సినిమాలకు ఎప్పుడూ డిమాండ్ తగ్గదు.. చిన్న హీరోలే కాదు పెద్ద హీరోలు కూడా హారర్ సినిమాలకు మొగ్గుచూపుతూ ఉంటారు. మనదగ్గర హాలీవుడ్ సినిమాలతో పోటీపడే రేంజ్ లో దెయ్యాల సినిమాలు చాలానే తెరకెక్కాయి. వాటిలో ఈ సినిమా ఒకటి. ఈ సినిమా చూస్తున్నంత సేపు గుండె జారీ ప్యాంట్‌లోకి వస్తుంది. ఊహించని ట్విస్ట్‌లు, భయపెట్టి సన్నివేశాలు ఆడియన్స్‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతున్నాయ్. ఇంతకూ ఈ సినిమా ఎదో తెలుసా.?

ఇప్పటికే ఎన్నో సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఆతర్వాత ఓటీటీల్లో విడుదలై మెప్పిస్తున్నాయి. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా అలానే వచ్చింది. ఓ పల్లెటూరిలో జరిగే కథ ఇది. క్షుద్రపూజలు, చేతబడులు,  మూఢనమ్మకాలు, మిస్టరీ ఎలిమెంట్స్‌ తో ఈ సినిమా సాగుంతుంటుంది.

గ్రామంలో ఓ వ్యక్తి ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తూ ఉంటాడు. అతని భార్య , పిల్లలతో ప్రశాంత జీవితం గడుపుతుంటాడు. అతని స్నేహితుడి కుటుంబం కూడా పక్కనే ఉంటుంది. అన్నీ సాధారణంగా సాగుతున్న సమయంలో ఆ ఊరిలో వరుసగా మరణాలు సంభవిస్తుంటాయి. ఊహించని రీతిలో ఒకొక్కరు చనిపోతూ ఉంటారు. దాంతో ఊర్లో అలజడి రేగుతుంది. ఆ ఊరి పూజారి ఎవరో చేతబడి చేస్తున్నారని చెప్తాడు. దాంతో అందరూ భయాందోళన గురవుతారు. ఆతర్వాత ఓ వ్యక్తి యువతీ శవంతో పూజలు చేస్తూ కనిపిస్తాడు.. అయితే ఆ గ్రామస్థులు అతన్ని అక్కడే చంపేస్తారు.. ఆతర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఈ సినిమా మరేదో కాదు మా ఉరి పొలిమేర. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది.సత్యం రాజేష్, గెటప్ శ్రీను, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి. ఈ సినిమా మొదటి భాగం ఆహాలో అందుబాటులో ఉండగా, రెండో భాగం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us