OTT Movie: 35 ఏళ్ల క్రితం మిస్సైన విమానం.. ఇప్పుడు క్రాష్ అయితే.. దిమ్మతిరిగే ట్విస్టులతో ట్రెండింగ్..

సస్పెన్స్, ప్రతి క్షణం ఊహించని ట్విస్టులతో సాగే సినిమాలకు, అలాగే వెబ్ సిరీస్ లకు మంచి క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో ఓటీటీలో ఎక్కువగా ఈ జానర్ చిత్రాలే దూసుకుపోతున్నాయి. ఇక ఇప్పుడు ఒక సిరీస్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దాదాపు 35 ఏళ్ల క్రితం మిస్సైన విమానం ఇప్పుడు మళ్లీ తెరపైకి చ్చి క్రాష్ అయితే ఎలా ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ తో వచ్చింది ఈ సిరీస్. అయితే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా.

OTT Movie: 35 ఏళ్ల క్రితం మిస్సైన విమానం.. ఇప్పుడు క్రాష్ అయితే.. దిమ్మతిరిగే ట్విస్టులతో ట్రెండింగ్..
Jl50 Web Series

Updated on: Nov 20, 2026 | 2:54 PM

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై క్రైమ్, కామెడీ, హారర్ జానర్లకు కొదవలేదు. కానీ భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత పకడ్బందీగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ థ్రిల్లర్లు వంటి చిత్రాలు రావడం అసలు ఊహించలేము. అలాంటి ఆసక్తికరమైన మినీ వెబ్ సిరీస్‌లలో ‘జేఎల్ 50’ (JL50) ఒకటి. కేవలం 4 ఎపిసోడ్లతో, ఉత్కంఠభరితమైన కథనంతో సాగే ఈ సిరీస్ ఐఎండీబీ (IMDb)లో 7.3 రేటింగ్ సొంతం చేసుకుంది. అభయ్ డియోల్, పంకజ్ కపూర్, పీయూష్ మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ కథ సీబీఐ ఆఫీసర్ శంతను (అభయ్ డియోల్) చుట్టూ తిరుగుతుంది. పశ్చిమ బెంగాల్‌లోని కొండ ప్రాంతంలో జరిగిన ఒక విమాన ప్రమాద కేసును దర్యాప్తు చేసేందుకు శంతను రంగంలోకి దిగుతాడు. మొదట ఇది ఉగ్రవాదుల హైజాక్ కేసు అని భావించినప్పటికీ, విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడుతుంది. ఆ విమానం మరేదో కాదు.. 1984లో కోల్‌కతా నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదృశ్యమైన ‘ఫ్లైట్ JL50’ అని తేలుతుంది.

ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..

విడిపోయిన కాక్‌పిట్‌లో పైలట్ బిహు ఘోష్ (రితికా ఆనంద్), ప్రొఫెసర్ బిస్వజిత్ చంద్ర మిత్రా (పీయూష్ మిశ్రా) మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. తాము 35 ఏళ్లు భవిష్యత్తులోకి వచ్చేశామని తెలిసి పైలట్ బిహు షాక్ అవ్వగా, ప్రొఫెసర్ మిత్రా మాత్రం ఆనందంతో సంబరాలు చేసుకుంటాడు. ఈ మిస్టరీని ఛేదించేందుకు శంతను క్వాంటమ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ సుబ్రతో దాస్ (పంకజ్ కపూర్) సహాయం తీసుకుంటాడు. గత ప్రభుత్వం రహస్యంగా నిర్వహించిన వార్మ్‌హోల్ ప్రాజెక్ట్ ద్వారా 35 గంటలు భవిష్యత్తులోకి వెళ్లాలని మిత్రా ఆ విమానాన్ని హైజాక్ చేయగా, సాంకేతిక లోపం వల్ల ఏకంగా 35 ఏళ్లు ముందుకు వచ్చేసిందని తెలుస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..

ఆ విమాన ప్రమాదాన్ని, హైజాక్‌ను ఆపడానికి శంతను, పైలట్ బిహు, ప్రొఫెసర్ దాస్‌లతో కలిసి తిరిగి 1984లోకి టైమ్ ట్రావెల్ చేస్తాడు. ఈ క్రమంలో శంతనుకు తన గతానికి సంబంధించిన ఊహించని నిజం తెలుస్తుంది. విమానం పైలట్ బిహు మరెవరో కాదు.. తన కన్నతల్లి అని, తనను చిన్నప్పుడు అనాథాశ్రమంలో వదిలేసిన వ్యక్తి తన తాతయ్య అని తెలుసుకుని శంతను భావోద్వేగానికి గురవుతాడు. గతంలోకి వెళ్లిన శంతను ఆ ప్రమాదాన్ని ఆపగలిగాడా లేదా అనేదే మిగతా కథ. శైలేంద్ర వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్టును నిజానికి 2017లోనే సినిమాగా చిత్రీకరించారు. కానీ మూడేళ్ల తర్వాత 2020లో నాలుగు ఎపిసోడ్ల వెబ్ సిరీస్‌గా మలచి సోనీ లివ్‌లో విడుదల చేశారు. 2003లో వచ్చిన ‘మక్బూల్’ తర్వాత పంకజ్ కపూర్, పీయూష్ మిశ్రా దాదాపు 16 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ కలిసి నటించడం విశేషం. తక్కువ నిడివిలో ఆకట్టుకునే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ‘జేఎల్ 50’ మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..

Loading...
Unable to load recommendations.
Follow Us