OTT Movie: ఆరుగురు అమ్మాయిల మర్డర్ మిస్టరీ.. ఓటీటీ మతిపొగొట్టే తెలుగు క్రైమ్ థ్రిల్లర్

గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ కావడంతో ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది. ఆరుగురు అమ్మాయిల మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే ఈ సినిమాలో ట్విస్టులు నెక్ట్స్ లెవెల్ అని చూసిన వారు రివ్యూలు ఇస్తున్నారు.

OTT Movie: ఆరుగురు అమ్మాయిల మర్డర్ మిస్టరీ.. ఓటీటీ మతిపొగొట్టే తెలుగు క్రైమ్ థ్రిల్లర్
Ott Movie (7)

Updated on: Jun 21, 2026 | 7:58 PM

ఈ  వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు వచ్చాయి. దృశ్యం 3, యోగిబాబు కెనతా కోనం, రవి బాబు రేజర్, అతిరథి వంటి సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు వచ్చాయి. అయితే వీటిలో ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఆకట్టుకునే కథా కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఒక ప్యాసింజర్ రైలులో ఓ అపరిచిత వ్యక్తి అమ్మాయి గొంతు పట్టుకుని చంపేందుకు యత్నించడం బయటి నుంచి హీరోయిన్ చూస్తుంది. దీనిపై ఆమె ఎంక్వైరీ చేస్తుండగానే అలా ఆరుగురు అమ్మాయిలను దారుణంగా చంపేశారని తెలుస్తుంది. మరి అసలు ఈ అమ్మాయిల మర్డర్స్ వెనుక మిస్టరీ ఏంటి? క్యాబ్ నడుపుకొనే హీరోకి హీరోయిన్ ఎలా పరిచయం అవుతుంది? అమ్మాయిల హత్యల మిస్టరీని వారు ఎలా ఛేదించారు? అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్న ఈ సినిమా పేరు ‘థాంక్యూ సుబ్బారావు’. గతంలో ‘ఓ పిట్టకథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ వంటి డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించిన చెందు ముద్దు ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. ఈ సినిమాలో చంద్రహాస్, లావణ్య హీరో, హీరోయిన్లుగా నటించారు. అలాగే మురళీధర్ రెడ్డి, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాత కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దినేష్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీత దర్శకుడిగా, పంకజ్ తొట్టాడ కెమెరామెన్‌గా పని చేశారు. డి. వెంకట్ ప్రభు ఎడిటర్‌గా వర్క్ చేశారు. అయితే ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే స్ట్రీమింగ్ అయ్యింది. గత వారమే (జూన్ 18) నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్  సినిమాలను చూసే వారికి  థాంక్యూ సుబ్బారావు ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆహా ఓటీటీలో థ్యాంక్యూ సుబ్బారావు..

థ్యాంక్యూ సుబ్బారావ్ సినిమా ట్రైలర్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us