
ఎప్పటి లాగే గత వారం ఓటీటీలో బోలెడన్ని కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. రాధిక శరత్ కుమార్ తాయ్ కిళవి, ఆది పిని శెట్టి శబ్దం, డార్క్ నైట్, ఓ రోమియో, తూ యా మై తదితర సినిమాలు ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అయితే ఇందులో ఇక ఇంగ్లిష్ సినిమా కూడా ఉంది. ఇదొక సర్వైవల్ థ్రిల్లర్. ప్రస్తుతం ఇంగ్లిష్ తో పాటు తెలుగు తదితర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఒళ్లు గగుర్పొడిచే సీన్లు, ఊహించని ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే.. ఇలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉన్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ కు మస్త్ మజా ఇవ్వబోతోంది. ఈ సినిమా కథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక వైపు కుంభ వృష్టి, మరోవైపు రాకాసి అలలు కలిసి ఓ తీర ప్రాంత పట్టనంపై విరుచుకు పడతాయి. దెబ్బకు ఊరంతా చెరువులా మారిపోతుంది. ఇళ్లన్నీ నీటితో నిండిపోతాయి. అక్కడ నివాసమున్న జనాలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటారు. అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఆ వరద నీళ్లలోకి ఒక్కసారిగా షార్క్ చేపలు ఎంట్రీ ఇస్తాయి. కంటికి కనిపించిన వారందరినీ ఆ షార్క్ లు పీక్కుతింటుంటాయి. ఇదే క్రమంలో ఓ నిండు గర్భిణి కూడా ఈ వరద నీటిలో చిక్కుకుంటుంది. ఒకవైపు పురిటి నొప్పులు, మరోవైపు చుట్టూ తిరుగుతున్న షార్క్స్.. ఈ ప్రమాదకర పరిస్థితి నుంచి ఆమె తనను, తన బిడ్డను ఎలా కాపాడుకుంది అన్నదే ఈ సినిమా కథ
ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లుతోన్న ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ట్రాష్’ (Thrash). టామీ విర్కోలా తెరకెక్కించిన ఈ సినిమాలో ఫోబ్ దైనేవర్, డిజిమోన్ హౌన్సౌ, విట్నీ పీక్ ప్రధాన పాత్రల్లో నటించారు. మొదట ఈ సినిమాను
థియేటర్లలో విడుదల చేయాలకున్నారు. కానీ వివిధ కారణాలతో డైరెక్టుగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా ఇంగ్లిష్ తో పాటు తెలుగు తదితర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీకెండ్ లోఒక మంచి థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ట్రాష్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.