Ram Gopal Varma: మనసులో మాట చెప్పిన రామ్ గోపాల్ వర్మ.. బాలయ్య ఒప్పుకుంటారా?

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఆయన ఏం చేసినా.. ఏం మాట్లాడినా సెన్సెషనే. ఎప్పుడు ఏ విషయంపై

Ram Gopal Varma: మనసులో మాట చెప్పిన రామ్ గోపాల్ వర్మ.. బాలయ్య ఒప్పుకుంటారా?
Rgv

Updated on: Jan 19, 2022 | 8:48 AM

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఆయన ఏం చేసినా.. ఏం మాట్లాడినా సెన్సెషనే. ఎప్పుడు ఏ విషయంపై ఎలా స్పందిస్తారనేది ఊహించడం కష్టతరమే. సమాజంలోని విషయాలపై.. సినీ ఇండస్ట్రీలో పరిస్థితులపై వర్మ తనదైన స్టైల్లో క్లారిటీ ఇచ్చేస్తారు. ఎలాంటి అంశం అయినా సరే.. సూటిగా జవాబు ఇచ్చేస్తుంటారు ఆర్జీవీ. ఇక నిన్న పెళ్లి, ప్రేమ, విడాకుల గురించి వర్మ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా రామ్ గోపాల్ వర్మ తన మనసులోని మాటలను బయటపెట్టారు. అదెంటో తెలుసుకుందాం.

నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా ప్రముఖ ఓటీటీ ఆహాలో అన్‎స్టాపబుల్ విత్ ఎన్బీకే షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అటు వెండితెరపైనే కాకుండా.. ఓటీటీలోనూ తన హోస్టింగ్‏తో సంచలనం సృష్టిస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే ఈ షోలో మెహాన్ బాబు, బ్రహ్మనందం, అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని, రవితేజ, అల్లు అర్జున్, రాజమౌళి, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. వారిని తన స్టైల్లో పంచులతో.. డైలాగ్స్ వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు బాలయ్య. తాజాగా ఈ షోపై డైరెక్టర్ ఆర్జీవి ఆసక్తకిర కామెంట్స్ చేశారు.

“నాకు ఆహాలో వచ్చే అన్‏స్టాపబుల్ విపరీతంగా నచ్చింది. నాకు ఆ షోకు వెళ్లాలని ఉంది. బాలయ్య గారు నాకు ఆ అవకాశం ఇస్తారని ఆశపడుతున్నాను ” అంటూ ట్వీట్ చేశారు వర్మ. మరీ ఆర్జీవి కోరుకుంటున్నట్లు బాలయ్య స్పందించి ఆయనను షోకు పిలుస్తారా ? లేదా అనేది ? చూడాలి.

ట్వీట్..

Also Read: Anasuya Bharadwaj : నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన అనసూయ.. ఇంతకు అతడు ఏమడిగాడంటే..

Bangarraju: జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు.. బంగార్రాజు స‌క్సెస్ మీట్‌లో నాగార్జున ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్‌..

Sneha: సంక్రాంతి సంబరాల్లో హీరోయిన్ స్నేహ ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..