OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో ప్రశాంత్ నీల్ హారర్ థ్రిల్లర్.. IMDBలో 8.7 రేటింగ్.. ఒంటరిగా చూడొద్దు

అక్టోబర్ 23న థియేటర్లలో రిలీజైన ఈ హారర్ థ్రిల్లర్ ఆడియెన్స్ ను బాగానే భయపెట్టింది. కంటెంట్ పరంగా కొన్ని విమర్శలు వచ్చినా టేకింగ్ పరంగా ఈ మూవీకి మంచి మార్కులే పడ్డాయి. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు ఐఎమ్ డీబీలో 8.7 రేటింగ్ దక్కడం విశేషం.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో ప్రశాంత్ నీల్ హారర్ థ్రిల్లర్.. IMDBలో 8.7 రేటింగ్.. ఒంటరిగా చూడొద్దు
OTT Movie

Updated on: Nov 15, 2026 | 6:05 PM

కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తో కలిసి డ్రాగన్ అనే మరో పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ మధ్యన ఓ హారర్ థ్రిల్లర్ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించారు. అదే 418. ప్రశాంత్ నీల్ దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేసిన కీర్తన్ నాదగౌడనే ఈ మూవీకి దర్శకత్వం వహించారు. చైత్ర జె ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. రిలీజ్ కు ముందు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్, ట్రైలర్ సినీ ప్రేక్షకులను బాగా భయపెట్టాయి. ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. దీంతో రిలీజ్ కు ముందే ఈ మూవీపై మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే పాన్ ఇండియా రేంజ్ లో అక్టోబర్ 23న 417 మూవీ రిలీజైంది. అయితే ఈ మూవీకి మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చింది. కంటెంట్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్లు బాగా పేలాయి. ఆడియెన్స్ ను బాగా భయపెట్టాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన 418 మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

418 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ గురువారం (నవంబర్ 19) నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ 418 సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుంది. 418 సినిమా విషయానికి వస్తే.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను నిర్మించారు. వెంకీ జీజీ సంగీతం అందించారు. ఇక కథ విషయానికి వస్తే.. ఊరికి దూరంగా ఉన్న ఓ మెడిక‌ల్ క‌ళాశాల హాస్ట‌ల్. మూత‌ప‌డిన 15 ఏళ్ల త‌ర్వాత తిరిగి తెరుస్తారు. కానీ అందులో 418 నంబ‌ర్ గ‌ది మాత్రం మూసే ఉంటుంది. ఆ గ‌ది పేరు వినిపిస్తే చాలు.. అందరూ వణికిపోతుంటారు. ఆ హాస్ట‌ల్‌లోకి మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశం కూడా ఉండ‌దు. ఇంతలోనే 417 గదిలోకి వివేక్ అనే విద్యార్థి చేరతాడు. అప్పటినుంచే అతనికి భయంకరమైన అనుభవాలు ఎదురవుతుతాయి. అతనిడిపై హ‌త్యాయ‌త్నం కూడా జ‌రుగుతుంది. అందుకు కార‌ణం 418 నంబ‌ర్ గ‌దే అని ఆ త‌ర్వాత అర్థ‌మ‌వుతుంది. మరి ఇన్నేళ్లుగా మూసి ఉన్న ఆ గ‌దిలో ఉన్న‌ది ఎవ‌రు? ఆ గ‌ది వెన‌కున్న ర‌హ‌స్యాలేమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

418 మూవీ ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us