The Raja Saab OTT: ఓటీటీలోకి వచ్చేసిన ప్రభాస్ ‘ది రాజాసాబ్‌’.. ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారుగా

సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ప్రభాస్ ది రాజా సాబ్ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. బాహుబలి, సాహో, సలార్, కల్కి సినిమాలు చేసిన ప్రభాస్ రేంజ్ కు ఇది తగిన సినిమా కాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయినా కూడా ప్రభాస్ క్రేజ్ కారణంగా ది రాజాసాబ్ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి.

The Raja Saab OTT: ఓటీటీలోకి వచ్చేసిన ప్రభాస్ ది రాజాసాబ్‌.. ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారుగా
Prabhas The Raja Saab Movie

Updated on: Feb 06, 2026 | 6:35 AM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ది రాజాసాబ్. మారుతి తెరకెక్కించిన ఈ ఫాంటసీ హారర్ కామెడీ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా జనవరి 09న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ది రాజా సాబ్ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. సలార్, కల్కి రేంజ్ లో ఈ సినిమా లేదన్న కామెంట్స్ వినిపించాయి. అయితే ప్రభాస్ అభిమానులకు మాత్రం ఈ మూవీ బాగా నచ్చింది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత వింటేజ్ ప్రభాస్ ను చూశామని ఫ్యాన్స్ సంబరపడ్డారు. ప్రభాస్ డ్యాన్సులు, యాక్షన్ సీక్వెన్సులతో కామెడీ కూడా అదరగొట్టాడని సినిమా చూసిన అభిమానులు చెప్పారు. చివరకు ప్రభాస్ క్రేజ్ కారణంగా ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. మొదటి రోజే రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ది రాజాసాబ్.. ఓవరాల్ గా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ది రాజాసాబ్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 06 నుంచి ప్రభాస్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం అర్ధరాత్రి నుంచే ది రాజాసాబ్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ తో ది రాజాసాబ్ సినిమాను నిర్మించినట్లు సమాచారం. ఈ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ కామెడీ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించారు. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ ప్రభాస్ తో రొమాన్స్ చేశారు. అలాగే సంజయ్ దత్, బొమన్ ఇరానీ, సముద్ర ఖని, జరీనా వాహబ్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేశ్, ప్రభాస్ శీను, సప్తగిరి తదితరులు వివిధ పాత్రలు పోషించారు. ఈ సినిమాకు తమన్ స్వరాలు అందించారు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ ఇంకోసారి చూడాలనుకుంటున్నారా? అయితే జియోహాట్ స్టార్ లో చూసి ఎంజాయ్ చేయండి

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో ది రాజాసాబ్ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.