
ఈ మధ్యన ఎక్కువగా హారర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీసులతోనే ప్రేక్షకలు ముందుకు వస్తున్నాడు నవీన్ చంద్ర. 28 డిగ్రీ సెల్సియస్, లెవెన్, షో టైమ్, బ్లైండ్ స్పాట్ వంటి క్రైమ్, హారర్, థ్రిల్లర్ మూవీస్ తో మన ముందుకు వచ్చాడీ ట్యాలెంటెడ్ హీరో. ఇందులో కొన్ని మాత్రమే ఆడియెన్స్ ను మెప్పించాయి. ఇక గత వారమే నవీన్ చంద్ర నటించిన మరో హారర్ థ్రిల్లర్ థియేటర్ల లో విడుదలైంది. అదే హనీ. పిల్లి మాయ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ చాలా ఆసక్తికరంగానే ఉన్నాయి. దీంతో రిలీజ్ కు ముందే ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఫిబ్రవరి 06న థియేటర్లలోవిడుదలైన ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. కథ, కథనాలు, బ్యాగ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్ ఎపిసోడ్ బాగానే ఉన్నా మితిమీరిన వయొలెన్స్, కాస్త గందరగోళంగా అనిపించే సన్నివేశాలు ఈ సినిమాకు మైనస్ గా మారాయి. దీంతో ఈ సినిమా థియేటర్లలో నుంచి త్వరగానే మాయమైపోయింది. అయితే ఐఎండీబీలో ఈ మూవీకి 7.9 రేటింగ్ రావడం గమనార్హం. అయితే ఇప్పుడీ హారర్ థ్రిల్లర్ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానుందని సమాచారం.
హనీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. థియేటర్లలో పెద్దగా ఆడని ఈ మూవీ ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. థియేటర్లలో ఆడని సినిమాలు, మరీ ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ మూవీస్ ఈ మధ్యన ఓటీటీలో ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. దీంతో హానీ మూవీ విషయంలోనూ ఇదే జరుగుతుందని నిర్మాతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. దివ్య పిళ్లై, దివి వాద్త్యా, రాజా రవీంద్ర, బేబీ జయన్ని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అజయ్ ఆర్ సదా సంగీతం అందించారు.
Thank you 🙏
Honey is receiving widespread critical acclaim 🔥Do NOT Miss This In Theaters 🤟
Book Your Tickets Now & Watch In Your Nearest Theaters 🎟️ 👇https://t.co/QGPcoa6To2#HoneyMovie – Now In Cinemas 🐈⬛ 🔴@Naveenc212 @KKfilmmaker @Rajaraveendar@DiviActor… pic.twitter.com/7TGCvBYf01
— Actor Naveen Chandra (@Naveenc212) February 7, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.