OTT Movie: ఆ శవాలు ఎవరివి? ఓటీటీలో సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

ఓటీటీలో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ సినిమాకు మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగే ఈ సినిమాలో ట్విస్టులు కూడా ఊహించని రేంజ్ లో ఉన్నాయి. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

OTT Movie: ఆ శవాలు ఎవరివి? ఓటీటీలో సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie

Updated on: Aug 26, 2026 | 7:55 PM

ప్రస్తుతం మలయాళం సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఓటీటీలో అయితే ఈ మాలీవుడ్ సినిమాలు, సిరీస్ లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్టుగానే వివిధ ఓటీటీ సంస్థలు ప్రతి వారం ఒకటి లేదా రెండు మలయాళం సినిమాలు సిరీస్ లను డబ్బింగ్ చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం సినిమానే. ఇదొక ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు సంబంధించిన మూవీ. థియేటర్లలో కేవలం మలయాళం వెర్షన్ మాత్రమే రిలీజ్ కాగా ఓటీటీలో మాత్రం తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథా కథనాలు, ఉత్కంఠ భరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చూసే వారికి బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇంఉదలో జానకి అనే ఓ వైద్యురాలు తాను ఓ మనిషిని చంపానంటూ పోలీస్ స్టేషన్ కు వెళుతుంది. అయితే పోలీసులు ఆమెను లైట్ తీసుకుంటారు. ఇదే విషయం మీడియా వచ్చి అడిగితే జానకికి మతిస్థిమితం లేదని చెబుతారు. అయితే జానకి మాత్రం నేను చంపిన వారిని ఎక్కడ పూడ్చింది చూపిస్తానంటూ అడ‌విలోకి తీసుకెళుతుంది. దీంతో పోలీసులు, మీడియాతో పాటు పెద్ద ఎత్తున ఊరి జనాలు అక్కడికి చేరుకుంటారు. అక్కడ తవ్వకాలు జరపగా రెండు శవాలు బయడ పడతాయి. అయితే ఈసారి జానకి వారిని నేను చంపలేదు ఓ పోలీస్ అధికారి చంపాడంటూ షాకింగ్ విషయం బయటపెడుతుంది. అందుకు తగిన ఆధారాలు కూడా చూపిస్తుంది. దీంతో స్వయంగా ఎస్పీ రంగంలోకి దిగి ఇన్వెస్టిగెషన్ మొదలుపెడతాడు. దర్యాప్తులో ఈ హత్యల్లో ఒక మంత్రి హస్తం కూడా ఉందని బయడటపడుతుంది. మరి అసలు చనిపోయిన వారు ఎవరు? వారికి జానకికి లింకేంటి? అసలు క్రిమినల్స్ ఎవరు? పోలీసులు వారిని ఎలా పట్టుకున్నారు? అన్నది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే.

ఆకాశమే హద్దురా సినిమా ఫేమ్ అపర్ణా బాల మురళి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా పేరు అదృశ్యం. సుధీశ్ రామచంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమాలో కళాభవన్ షాజోన్, హరీష్ ఉత్తమన్, సిద్దిక్, చందునాథ్ జి నాయర్, జాఫర్ ఇడుక్కి, సిద్ధార్థ్ మీనన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ ‘ఖుషి’, న్యాచులర్ స్టార్ నాని ‘హాయ్ నాన్న’ సినిమాలకు అద్దిరిపోయే సంగీతం అందించిన హేషమ్ అబ్దుల్ వ‌హాబ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం అదృశ్యం సినిమా తెలుగు వెర్షన్ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే యూట్యూబ్ లోనూ తెలుగు వెర్షన్ ఉచితంగా అందుబాటులో ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us